Last Updated:
టీనేజర్ల సోషల్ మీడియా వినియోగం, మానసిక ఆరోగ్యంపై ప్రభావానికి సంబంధించి మెటాపై కొనసాగుతున్న న్యాయపోరాటం కీలక మలుపు తిరిగింది. 47 రాష్ట్రాలు దాఖలు చేసిన క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు సుమారు 17 బిలియన్ డాలర్ల భారీ సెటిల్‌మెంట్‌కు మెటా అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా పిల్లలు, టీనేజర్ల కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రీన్ టైమ్, కంటెంట్, తల్లిదండ్రుల నియంత్రణలకు సంబంధించి మరిన్ని భద్రతా చర్యలు తీసుకోనుంది.
టీనేజర్లలో సోషల్ మీడియా వ్యసనం, మానసిక ఆరోగ్యంపై ప్రభావం వంటి అంశాలకు సంబంధించి మెటాపై కొనసాగుతున్న కీలక న్యాయపోరాటానికి ముగింపు పలికేందుకు కంపెనీ భారీ పరిష్కార ఒప్పందానికి అంగీకరించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లపై పిల్లల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు, 47 రాష్ట్రాలు దాఖలు చేసిన క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు సుమారు 17 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు మెటా అంగీకరించినట్లు రాష్ట్ర అటార్నీ జనరల్‌లు బుధవారం ప్రకటించారు.

