Last Updated:
Exclusive Report | హైదరాబాద్‌లో లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కోకాపేట్‌లోని ట్రంప్ టవర్స్‌లో రూ.62 కోట్ల పెంట్‌హౌస్ అమ్ముడవడంతో ఈ ప్రాజెక్ట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. డ్యూప్లెక్స్ ఇళ్లకు కూడా భారీ డిమాండ్ రావడం విశేషం.
హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. కోకాపేట్లో నిర్మిస్తున్న ట్రంప్ టవర్స్ హైదరాబాద్‌లో దాదాపు రూ.62 కోట్ల విలువైన పెంట్‌హౌస్ ఇప్పటికే అమ్ముడైందన్న వార్త పెద్ద చర్చనీయాంశమైంది. డ్యూప్లెక్స్ ఇళ్లకు కూడా ఊహించని స్థాయిలో ఆసక్తి కనిపిస్తుండటంతో డెవలపర్లు ప్రాజెక్ట్‌ను డిసెంబర్ నాటికి ఎక్కువ భాగం అమ్మేయాలని చూస్తున్నారు. ట్రంప్ టవర్స్ హైదరాబాద్‌ను ప్రకటించి రెండు వారాలు మాత్రమే అయినా, అల్ట్రా-లగ్జరీ విభాగంలో మంచి స్పందన వస్తోందని ఐరా రియల్టీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ నర్సి రెడ్డి తెలిపారు. న్యూస్18 తెలుగుతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్డేట్స్ పంచుకున్నారు. ల్యాండ్ ఓనర్ వాటాలో ఉన్న 3.5-బీహెచ్‌కే ఇన్వెంటరీ మొత్తం అమ్ముడైందని, రెండు టవర్లలోని పెంట్‌హౌస్‌లు కూడా బుక్ అయ్యాయని చెప్పారు.

