ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ వంటకు ఏ నూనె వాడాలనేది కీలకంగా మారింది. ప్రతి నూనెకు దాని సొంత పోషక విలువలు, కొవ్వు రకాలు, స్మోక్ పాయింట్, వంటలో ఉపయోగించే విధానం ఉంటాయి. రైస్ బ్రాన్, సన్ఫ్లవర్, సోయాబీన్, ఆలివ్, కొబ్బరి, కెనోలా, అవకాడో వంటి నూనెలు ఆరోగ్యానికి వివిధ రకాలుగా ఉపయోగపడతాయని చెబుతారు. అయితే అందరికీ ఒకే నూనె ఉత్తమం అని చెప్పడం కంటే, మన ఆరోగ్య అవసరాలు, వంట పద్ధతి, ఆహార అలవాట్లను బట్టి నూనెను ఎంచుకోవడం మంచిదని అంటున్నారు డైటిషియన్ డాక్టర్ శ్రీలత.

