ఏదైనా పాత బండిని తీసుకునే ముందు ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) అసలైనదా కాదా అన్నది నిశితంగా పరిశీలించాలి. అందులో ఉన్న వాహనం వివరాలు, యజమాని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. టాక్స్ బకాయిలు, ఫైనాన్స్, పర్మిట్, ఎఫ్‌సీతో పాటు ఆ బండిపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే విషయాలను పూర్తిగా ఆరా తీయాలి.
