ప్రస్తుతం ఉద్యోగ మార్పులు సాధారణంగా మారిపోయాయి. ఒక ఉద్యోగి ఒక సంస్థలో కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మరో సంస్థలో చేరడం, ఆ తర్వాత మరో కంపెనీకి మారడం జరుగుతుంటుంది. ఇలాంటి సమయంలో ప్రతి ఉద్యోగి తన EPF, EPS సర్వీస్ రికార్డులు సరిగ్గా కొనసాగుతున్నాయా అనే విషయాన్ని పరిశీలించాలి. ఉద్యోగం మారిన ప్రతిసారీ పాత PF ఖాతాలోని వివరాలు, కొత్త ఉద్యోగానికి సంబంధించిన PF వివరాలు, UAN, సర్వీస్ కాలం వంటి అంశాలను సరిగ్గా నిర్వహించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందాలనే లక్ష్యం ఉన్నవారు తమ క్వాలిఫైయింగ్ సర్వీస్‌కు సంబంధించిన రికార్డులను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
