వర్షాకాలం వచ్చిందంటే వేడి నుంచి కాస్త ఉపశమనం దొరికినట్టే. కానీ ఈ సీజన్లో మరో సమస్య నెమ్మదిగా మొదలవుతుంది. గాలిలో తేమ పెరగడం, శరీరంపై చెమట ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దురద, రింగ్వార్మ్ వంటి సమస్యలు వేధించే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా తొడల మధ్య, గజ్జలు, చంకలు, మెడ, చర్మపు మడతలు వంటి ప్రాంతాల్లో తేమ ఎక్కువసేపు నిలిచిపోవడంతో సమస్య మరింత తీవ్రం కావచ్చు.

