Last Updated:
పంట పండించిన తర్వాత మార్కెట్ ధర ఒక్కసారిగా పడిపోతే రైతులకు ఏం జరుగుతుంది? అలాంటి పరిస్థితుల్లో MSP రక్షణగా నిలిచే PM-AASHA పథకానికి 2026-27లో కేంద్రం ₹7,200 కోట్లు కేటాయించింది.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చూడటంతో పాటు, మార్కెట్‌లో ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్టపోకుండా రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక కార్యక్రమాల్లో ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (PM-AASHA) ఒకటి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద రూ. 7,200 కోట్లను కేటాయించేందుకు కేంద్రం నిర్ణయించింది. MSP ఆధారిత కొనుగోళ్లు, ధరల లోటు భర్తీ, మార్కెట్ జోక్యం వంటి చర్యల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు ధరల భద్రత కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.

