నంబర్ 1 (ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు) నంబర్ 1 వారికి ఆత్మవిశ్వాసం, ఆశావాదం రోజంతా తోడవుతాయని చిరాగ్ దారువాలా చెబుతున్నారు. అద్భుతమైన ఆరోగ్యం వల్ల పూర్తి ఉత్సాహంగా గడుపుతారు. అయితే ఆఫీసులో మీ బాస్‌తో చిన్నపాటి విభేదాలు వచ్చే ప్రమాదం ఉన్నందున శాంతంగా ఉండండి. జీవిత భాగస్వామి మీ శారీరక, భావోద్వేగ మరియు మేధోపరమైన అవసరాలను అర్థం చేసుకుని మీకు పూర్తి అండగా నిలుస్తారు. అదృష్ట సంఖ్య: 4 | అదృష్ట రంగు: నీలం
