అందుకే తయారు చేసిన టీని ఎంతసేపు, ఏ పరిస్థితుల్లో ఉంచామన్నది కూడా ముఖ్యమే. ఇక టీని పదేపదే వేడి చేయడం వల్ల దాని రుచి, వాసనలో మార్పులు రావడంతో పాటు టీలోని కొన్ని సహజ సమ్మేళనాలపై కూడా ప్రభావం పడవచ్చు.ముఖ్యంగా గ్రీన్ టీ, హెర్బల్ టీ వంటి వాటిని ఎక్కువసేపు ఉంచి మళ్లీ వేడి చేయడం వల్ల వాటి తాజాదనం, రుచి తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి తయారు చేసిన టీని గంటల తరబడి అలాగే ఉంచి తాగడం వల్ల తాజాగా తయారు చేసిన టీతో సమానమైన అనుభూతి, ప్రయోజనం ఉండదని చెబుతున్నారు.
