Last Updated:
Chicken Soup:జలుబు, దగ్గు నుండి తక్షణ ఉపశమనం ఇచ్చే ఘాటైన చికెన్ సూప్ తయారీ విధానం! రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే చేసుకునే ఆ పక్కా రెసిపీ ఇప్పుడు తెలుసుకుందాం…
Chicken Soup: వర్షాకాలంలో లేదా వాతావరణం మారినప్పుడు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తీవ్రమైన అలసట రావడం చాలా సహజం. ఆ సమయంలో వేడి వేడిగా ఏదైనా తాగాలనిపించినప్పుడు చికెన్ సూప్ అద్భుతమైన ఎంపికగా నిలుస్తుందని అనుభవజ్ఞురాలైన గృహిణి తన్మయి వివరిస్తున్నారు. చికెన్ సూప్ కేవలం రుచి మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన లీన్ ప్రోటీన్, ఇమ్యూనిటీని పెంచే పోషకాలను అందిస్తుంది. గొంతులో ఉండే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ఇది దివ్యౌషధంలా పనిచేస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇంట్లోనే ఎంతో సులభంగా, అచ్చం రెస్టారెంట్ రుచితో ఘాటైన చికెన్ సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, ఆ పక్కా తయారీ పద్ధతి వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

