ప్రభన్యూస్

Flight Tickets: విమాన టికెట్ ధరలు ఇక ఇష్టారాజ్యంగా పెంచలేరా? సుప్రీంకోర్టులో కేంద్రం కీలక హామీ | Centre Fast-Tracks New Airfare Rules | బిజినెస్


Last Updated:

Flight Tickets | విమాన టికెట్ ధరలపై పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కొత్త నిబంధనల రూపకల్పనను వేగవంతం చేశామని, మూడు వారాల్లో పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.

Flight Tickets: విమాన టికెట్ ధరలు ఇక ఇష్టారాజ్యంగా పెంచలేరా? సుప్రీంకోర్టులో కేంద్రం కీలక హామీ (ప్రతీకాత్మక చిత్రం)
Flight Tickets: విమాన టికెట్ ధరలు ఇక ఇష్టారాజ్యంగా పెంచలేరా? సుప్రీంకోర్టులో కేంద్రం కీలక హామీ (ప్రతీకాత్మక చిత్రం)

విమాన టికెట్ ధరలు ఎప్పుడు ఎలా పెరుగుతాయో ప్రయాణికులకు అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా పండుగల సమయంలో టికెట్ ధరలు భారీగా పెరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత విమానయాన రంగాన్ని ఆధునికీకరించేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టం కింద నిబంధనలను మూడు వారాల్లో ఖరారు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. భారతీయ వాయుయాన్ అధినియమ్, 2024 కింద నిబంధనల రూపకల్పనను వేగవంతం చేశామని సోమవారం కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఈ నిబంధనలను మూడు వారాల్లో ఖరారు చేస్తామని తెలిపింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ముందు కేంద్రం ఈ నిబంధనల ముసాయిదాను సీల్డ్ కవర్‌లో ఉంచింది. కొన్ని తుది చర్చలు ఇంకా జరుగుతున్నాయని చెప్పింది. “దీన్ని ఏడు రోజుల్లో ప్రచురించండి” అని ధర్మాసనం సూచించింది. “ఎయిర్‌లైన్స్ నిబంధనలు పాటించకపోతే వాటి కార్యకలాపాలను నిలిపివేయండి” అని కూడా స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 August 2026, 5:15 pm Digital Edition : Prabhanews
Flight Tickets: విమాన టికెట్ ధరలు ఇక ఇష్టారాజ్యంగా పెంచలేరా? సుప్రీంకోర్టులో కేంద్రం కీలక హామీ | Centre Fast-Tracks New Airfare Rules | బిజినెస్

Last Updated:Aug 17, 2026 5:03 PM ISTFlight Tickets | విమాన టికెట్ ధరలపై పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కొత్త నిబంధనల రూపకల్పనను వేగవంతం చేశామని, మూడు వారాల్లో పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.Flight Tickets: విమాన టికెట్ ధరలు ఇక ఇష్టారాజ్యంగా పెంచలేరా? సుప్రీంకోర్టులో కేంద్రం కీలక హామీ (ప్రతీకాత్మక చిత్రం)విమాన టికెట్ ధరలు ఎప్పుడు ఎలా పెరుగుతాయో ప్రయాణికులకు అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా పండుగల సమయంలో టికెట్ ధరలు భారీగా పెరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత విమానయాన రంగాన్ని ఆధునికీకరించేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టం కింద నిబంధనలను మూడు వారాల్లో ఖరారు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. భారతీయ వాయుయాన్ అధినియమ్, 2024 కింద నిబంధనల రూపకల్పనను వేగవంతం చేశామని సోమవారం కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఈ నిబంధనలను మూడు వారాల్లో ఖరారు చేస్తామని తెలిపింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ముందు కేంద్రం ఈ నిబంధనల ముసాయిదాను సీల్డ్ కవర్‌లో ఉంచింది. కొన్ని తుది చర్చలు ఇంకా జరుగుతున్నాయని చెప్పింది. "దీన్ని ఏడు రోజుల్లో ప్రచురించండి" అని ధర్మాసనం సూచించింది. "ఎయిర్‌లైన్స్ నిబంధనలు పాటించకపోతే వాటి కార్యకలాపాలను నిలిపివేయండి" అని కూడా స్పష్టం చేసింది.మరింత చదవండి

Source link