ఈ ఏడాది ఉద్యోగ డిమాండ్లో దాదాపు 45 శాతం టియర్-2, టియర్-3 నగరాల నుంచి వచ్చే అవకాశం ఉంది. లక్నో, భువనేశ్వర్, జైపూర్, కోయంబత్తూర్ వంటి నగరాల్లో ఈ డిమాండ్ ఎక్కువగా ఉండొచ్చని నివేదిక తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఈ-కామర్స్ సేవలు విస్తరించడం, ఆర్గనైజ్డ్ రిటైల్ పెరగడం, వినియోగం పెరుగుతుండటం ఇందుకు ప్రధాన కారణాలు. అదే సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి టియర్-1 నగరాల్లో టాలెంట్ కొరత ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ ఉద్యోగుల మారే రేటు ఎక్కువగా ఉండటం, గిగ్ ఉద్యోగాల వైపు ఆసక్తి పెరగడం వల్ల అవసరమైన సిబ్బందిని నియమించుకోవడం, వారిని ఎక్కువ కాలం కొనసాగించడం కంపెనీలకు కష్టంగా మారుతోంది. ఈ టాలెంట్ కొరత దాదాపు 30 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
