Crab Meat: సముద్రపు ఆహారాలలో చేపలు, రొయ్యలతో పాటు పీతలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చాలామంది పీతలను కేవలం అద్భుతమైన రుచి కోసమే తింటుంటారు. కానీ పీత మాంసంలో శరీరానికి అవసరమైన అత్యంత శక్తివంతమైన పోషకాలు, లీన్ ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా దాగి ఉన్నాయని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ సీనియర్ క్లినికల్ డైటీషియన్ డాక్టర్ ఎస్. స్వాతి స్పష్టం చేస్తున్నారు.

