ఈ పరీక్షల ద్వారా ప్రధానంగా 6 రకాల సైకోయాక్టివ్ (మత్తు) పదార్థాలను గుర్తిస్తారు. ఆంఫెటమైన్స్, ఓపియేట్స్, గంజాయి (కన్నాబిస్/THC), కొకైన్, బార్బిట్యురేట్స్, బెంజోడియాజెపైన్స్ వంటి డ్రగ్స్ వాడకాన్ని ఈ పరీక్షల్లో సులభంగా పసిగడతారు. పైలెట్లు నల్ల గసగసాలు (poppy seeds), పండుగల సమయంలో భంగ్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలని డీజీసీఏ సూచించింది, ఎందుకంటే ఇవి ఓపియేట్స్, కన్నాబిస్ ఫలితాలను తప్పుగా చూపే ప్రమాదం ఉంది.
