ఈ సినిమాలో మహేశ్వరీ నటన, గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆమె ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయారు. ఆ తర్వాత మహేశ్వరీకి వరుసగా మంచి అవకాశాలు వచ్చాయి. ‘దెయ్యం’, ‘మృగం’, ‘పెళ్లి’, ‘ప్రియరాగాలు’ వంటి సినిమాల్లో నటించారు. ముఖ్యంగా కథలో తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకోవడం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.
