Last Updated:
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే చేగోడీలను ఒకసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని ఎయిర్ టైట్ డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
సాయంత్రం సమయం వచ్చిందంటే వేడివేడిగా, కరకరలాడే స్నాక్ తినాలని చాలామందికి అనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కాఫీ లేదా టీతో పాటు ఏదైనా క్రిస్పీగా ఉంటే ఆ మజానే వేరు. అలాంటి సమయంలో చేగోడీలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది చూడటానికి గుండ్రని ఆకారంలో ఉండి, కరకరలాడుతూ సూపర్‌గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ స్నాక్‌ను ఒకసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని ఎయిర్ టైట్ డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు.

