రోజుకు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం ఉంటే, అందులో హైవే ప్రయాణం కూడా ఉంటే బైక్‌ను ఎంచుకోవడం మంచిది. ఎక్కువ మైలేజీ, మన్నిక, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులకు ప్రాధాన్యం ఇచ్చేవారికి కూడా కమ్యూటర్ బైక్ సరైన ఎంపిక. మరోవైపు, సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం, రోజువారీ అవసరాలకు ఎక్కువ ప్రాక్టికాలిటీ కావడం, సీటు కింద స్టోరేజ్ అవసరం ఉండటం, గేర్లు మార్చకుండా సులభంగా నడపాలనుకోవడం వంటి అవసరాలు ఉంటే పెట్రోల్ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్ మెరుగైన ఎంపిక. మొత్తంగా చెప్పాలంటే, ఎక్కువ దూరం ప్రయాణించే వారికి, మంచి మైలేజీతో తక్కువ రన్నింగ్, మెయింటెనెన్స్ ఖర్చులు కావాలంటే బైక్ ఉపయోగకరంగా ఉంటుంది. నగర ట్రాఫిక్‌లో ఒత్తిడి లేకుండా, సౌకర్యంగా ప్రయాణించాలనుకునేవారికి స్కూటర్ మరింత అనుకూలంగా ఉంటుంది. మీ రోజువారీ ప్రయాణ దూరం, రోడ్ల పరిస్థితి, స్టోరేజ్ అవసరం, ఛార్జింగ్ సదుపాయం, బడ్జెట్‌ను బట్టి సరైన టూ-వీలర్‌ను ఎంచుకోవడం ముఖ్యం. (ప్రతీకాత్మక చిత్రం)
