Last Updated:
Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 11కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా?
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారాంతంలో 75 డాలర్లకు దిగివచ్చిన ముడి చమురు మంగళవారం ఉదయం 6 గంటల (భారత కాలమానం ప్రకారం) ప్రాంతంలో 82 డాలర్లకు చేరుకుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. మరోసారి ఇరు దేశాల మధ్య దాడులు జరిగితే మాత్రం క్రూడ్ ధరలు మరోసారి భారీగా పెరగడం ఖాయం.

