పెట్రోల్లో కలపడానికి ఉపయోగించే ఇథనాల్లో క్లోరైడ్ ఎంత ఉండాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన ప్రమాణాలు పెట్టింది. ఈ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నది తెలుసుకునేందుకు సరఫరా వ్యవస్థ అంతటా తరచుగా తనిఖీలు జరుగుతున్నాయి. రిఫైనరీలు, డిస్టిలరీలు, డిపోలు, టెర్మినల్స్, పెట్రోల్ బంకులు ఇలా సరఫరా వ్యవస్థలోని పలు దశల్లో క్లోరైడ్ స్థాయిని పరీక్షిస్తున్నారు. దీంతో ఇంధన నాణ్యత మొత్తం సరఫరా వ్యవస్థలోనూ నిరంతరం నియంత్రణలో ఉందని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉన్న నాణ్యత తనిఖీలకు అదనంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పర్యవేక్షణను మరింత పెంచాయి. ప్రతి పెట్రోల్ బంక్లో రోజుకు 8 నుంచి 12 సార్లు నీరు కలిసిందా లేదా, ఇంధన సాంద్రత ఎంత ఉందన్నది పరీక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మొబైల్ ఫ్యూయల్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబొరేటరీలను కూడా ఏర్పాటు చేశారు. (image: AI Generated)
