భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ముగ్గు లేదా రంగోలి ఎంతో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. పూర్వకాలం నుంచి ప్రతి ఉదయం ఇంటి ఆవరణను శుభ్రం చేసి, పేడనీళ్లు చల్లి, ఇంటి ముందు ముగ్గు వేయడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పట్టణాల్లో ఈ అలవాటు కొంత తగ్గినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. చాలామంది ముగ్గును కేవలం ఇంటి అందం కోసం వేస్తారని భావిస్తారు. కానీ దీని వెనుక ఆధ్యాత్మిక, సాంప్రదాయ, ఆరోగ్యపరమైన మరియు ప్రకృతితో ముడిపడిన అనేక విశేషాలు ఉన్నాయని జ్యోతిష్యంలో 10 ఏళ్ల అనుభవం ఉన్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు గుడి ప్రశాంత్ శర్మ న్యూస్ 18తో అన్నారు.

