సరికొత్త వ్యూహంతో 2022లో ‘అరివా ఆర్గానిక్స్’ (Ariva Organics) అనే కంపెనీని అన్ష్ స్థాపించాడు. బయో పెస్టిసైడ్స్, డ్రోన్ ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను రైతులకు పరిచయం చేశాడు. అతడి ఆధునిక టెక్నాలజీ సహాయంతో రైతులకు నీరు, ఎరువులు, కూలీల ఖర్చులు భారీగా తగ్గాయి. కేవలం ఏడాదిలోనే ఆ కంపెనీ విలువ రూ. 50 కోట్లు దాటింది. ప్రస్తుతం 15,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న 5,000 మందికి పైగా రైతులకు అన్ష్ తన కంపెనీ ద్వారా అండగా నిలుస్తూ విజయపథంలో దూసుకుపోతున్నాడు.

