కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ.. ఇథనాల్ బ్లెండింగ్.. అంటే పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతున్న విధానాన్ని గట్టిగా సమర్థించుకుంటూ ఒక సమగ్ర ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ దేశంలో ఈ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టకపోయి ఉంటే, ప్రపంచ దేశాల్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 135 డాలర్లకు చేరుకున్న అత్యంత క్లిష్ట సమయంలో.. దేశ రాజధాని ఢిల్లీలో రిటైల్ పెట్రోల్ ధర లీటరుకు సుమారు 125 రూపాయల వరకు పెరిగి ఉండేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ప్రతి లీటరు పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం ద్వారానే, వినియోగదారులకు పెట్రోల్ 94.77 రూపాయలకే లభించిందనీ, ఇది సామాన్యులకు భారీ ఉపశమనం కలిగించిందని వివరించింది.

