ఈ అవార్డుతో యామి గౌతమ్ తన సినీ ప్రయాణంలో మరో మైలురాయిని చేరుకున్నారు. ‘విక్కీ డోనర్’, ‘కాబిల్’, ‘బాలా’, ‘ఏ థర్స్డే’, ‘ఓఎంజీ 2’ వంటి చిత్రాలతో నటిగా తన ప్రతిభను చాటుకున్న ఆమె, ఇప్పుడు జాతీయ అవార్డు అందుకోవడంతో దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు.

