ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం, ఈపీఎస్ కింద కనీస పెన్షన్ పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పలు వర్గాల నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, పెన్షన్ పెంపు విషయంలో పెన్షన్ ఫండ్ ఆర్థిక స్థితి, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. అంటే ఇప్పటికైతే కనీస పెన్షన్ను రూ.7,500కు పెంచే విషయంపై అధికారిక ప్రకటన గానీ, అమలు తేదీ గానీ ప్రకటించలేదు. (ప్రతీకాత్మక చిత్రం)

