వర్షాకాలంలో తులసికి ఎక్కువ మొత్తంలో ఎరువులు వేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మొక్క పెరుగుదల మందగించినట్లు అనిపిస్తే నెలకు ఒకసారి కొద్దిగా వర్మీకంపోస్ట్, ఆవుపేడ ఎరువు లేదా ఇంట్లో తయారుచేసిన సేంద్రియ ఎరువును ఉపయోగించవచ్చు. అలాగే గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చిన్న కీటకాలు, శిలీంధ్రాలు దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఆకులు, కొమ్మలను పరిశీలించాలని సూచిస్తున్నారు. కీటకాలు కనిపిస్తే వేపనూనె ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా వాటిని నియంత్రించవచ్చు. క్రమం తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలం మొత్తం తులసి మొక్క ఆరోగ్యంగా, పచ్చగా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

