యూరిక్ యాసిడ్ పెరగడానికి ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఎర్ర మాంసం, సముద్రపు ఆహారం, ప్యూరిన్ అధికంగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, బీర్, విస్కీ వంటి మద్యపానానికి అలవాటు పడటం, చక్కెర లేదా ఫ్రక్టోజ్ అధికంగా ఉండే శీతల పానీయాలను తరచూ తాగడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. వీటితో పాటు అధిక బరువు, మూత్రపిండాల పనితీరు తగ్గిపోవడం, వంశపారంపర్య కారణాలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, రోజంతా తగినంత నీరు తాగకపోవడం కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ముఖ్యమైన కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు.

