ప్రభన్యూస్

Yash Toxic: టాక్సిక్ సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్.. వామ్మో 5 గురు హీరోయిన్‌లతో యష్ మాములు రచ్చ చేయలేదుగా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రాకింగ్ స్టార్ యష్ (Yash) నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్ గా మారింది.

News18
News18

‘కేజీఎఫ్’ (KGF) సిరీస్‌తో ప్యాన్ ఇండియా స్టార్‌గా, బాక్సాఫీస్ వద్ద రికార్డుల రారాజుగా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్ (Yash) నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’ (Toxic). జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా గ్యాప్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, దీనికి సంబంధించిన ఏ చిన్న వార్తైనా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి మ్యూజికల్ ట్రీట్‌తో పాటు ట్రైలర్ అప్‌డేట్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇప్పటికే ‘టాక్సిక్’ నుంచి విడుదలైన ‘తబాహీ’ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఆ పాటలో యష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ జోష్‌ను కంటిన్యూ చేస్తూ మేకర్స్ ఇప్పుడు రెండో పాటను విడుదల చేశారు. ఈ రోజు (బుధవారం) ఈ సాంగ్ విడుదలైంది. ఈ పాటలో రొమాన్స్ అయితే పీక్స్ అంతే. యష్-తారా సుతారియా రొమాంటిక్ సీన్స్ పిచ్చెక్కించాయి. బాత్ టబ్‌లో గన్‌తో ప్రపోజ్ చేసిన సీన్ అయితే ఓ లెవెల్ గా ఉంది. చూస్తుంటే టాక్సిక్ పాటలన్నీ రొమాన్స్ తో నింపేశారని అర్థమవుతోంది.

తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా, అర్స్లాన్ నిజామీలు సంయుక్తంగా ఈ పాటకు సంగీతం అందించగా, ప్రముఖ సింగర్ సిద్ధార్థ్ బస్రూర్ తన పవర్‌ఫుల్ వాయిస్‌తో పాడారు. పాటల సందడి ఒకవైపు ఉంటే.. సినిమా అసలు థీమ్‌ను పరిచయం చేసే ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫిలిం నగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం, 2026 ఆగస్టు 8న ‘టాక్సిక్’ అఫీషియల్ ట్రైలర్‌ను అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రైలర్‌తో సినిమా కథాంశం, యష్ లుక్, గీతూ మోహన్‌దాస్ టేకింగ్‌పై ఒక స్పష్టత రానుంది.

ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్ర పోషిస్తుండగా.. రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, బాలాజీ మనోహర్, అమిత్ తివారీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశేషమేమిటంటే, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థ ద్వారా హీరో యష్ స్వయంగా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్‌తో పాటు పలువురు దిగ్గజ సంగీత దర్శకులు ఈ సినిమాకు పనిచేస్తుండటం విశేషం. ఏదేమైనా బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్‌తో యష్ అభిమానులకు ఇక పండగే అని చెప్పవచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 9:40 am Digital Edition : Prabhanews
Yash Toxic: టాక్సిక్ సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్.. వామ్మో 5 గురు హీరోయిన్‌లతో యష్ మాములు రచ్చ చేయలేదుగా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 21, 2026 12:38 PM ISTరాకింగ్ స్టార్ యష్ (Yash) నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సిక్'. తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్ గా మారింది. News18'కేజీఎఫ్' (KGF) సిరీస్‌తో ప్యాన్ ఇండియా స్టార్‌గా, బాక్సాఫీస్ వద్ద రికార్డుల రారాజుగా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్ (Yash) నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సిక్' (Toxic). జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా గ్యాప్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, దీనికి సంబంధించిన ఏ చిన్న వార్తైనా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి మ్యూజికల్ ట్రీట్‌తో పాటు ట్రైలర్ అప్‌డేట్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.ఇప్పటికే 'టాక్సిక్' నుంచి విడుదలైన 'తబాహీ' సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఆ పాటలో యష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ జోష్‌ను కంటిన్యూ చేస్తూ మేకర్స్ ఇప్పుడు రెండో పాటను విడుదల చేశారు. ఈ రోజు (బుధవారం) ఈ సాంగ్ విడుదలైంది. ఈ పాటలో రొమాన్స్ అయితే పీక్స్ అంతే. యష్-తారా సుతారియా రొమాంటిక్ సీన్స్ పిచ్చెక్కించాయి. బాత్ టబ్‌లో గన్‌తో ప్రపోజ్ చేసిన సీన్ అయితే ఓ లెవెల్ గా ఉంది. చూస్తుంటే టాక్సిక్ పాటలన్నీ రొమాన్స్ తో నింపేశారని అర్థమవుతోంది.తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా, అర్స్లాన్ నిజామీలు సంయుక్తంగా ఈ పాటకు సంగీతం అందించగా, ప్రముఖ సింగర్ సిద్ధార్థ్ బస్రూర్ తన పవర్‌ఫుల్ వాయిస్‌తో పాడారు. పాటల సందడి ఒకవైపు ఉంటే.. సినిమా అసలు థీమ్‌ను పరిచయం చేసే ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫిలిం నగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం, 2026 ఆగస్టు 8న 'టాక్సిక్' అఫీషియల్ ట్రైలర్‌ను అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రైలర్‌తో సినిమా కథాంశం, యష్ లుక్, గీతూ మోహన్‌దాస్ టేకింగ్‌పై ఒక స్పష్టత రానుంది.ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్ర పోషిస్తుండగా.. రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, బాలాజీ మనోహర్, అమిత్ తివారీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశేషమేమిటంటే, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థ ద్వారా హీరో యష్ స్వయంగా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్‌తో పాటు పలువురు దిగ్గజ సంగీత దర్శకులు ఈ సినిమాకు పనిచేస్తుండటం విశేషం. ఏదేమైనా బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్‌తో యష్ అభిమానులకు ఇక పండగే అని చెప్పవచ్చు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,TelanganaFirst Published :Jul 21, 2026 12:38 PM ISTమరింత చదవండి

Source link