23వ విడత కింద విడుదలైన నిధుల వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. అక్కడ 2,17,63,781 మంది రైతులకు రూ.4,353.25 కోట్లు విడుదల చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 90,55,669 మంది రైతులకు రూ.1,811.67 కోట్లు, మధ్యప్రదేశ్లో 81,65,837 మంది రైతులకు రూ.1,634.61 కోట్లు, బీహార్లో 73,04,821 మంది రైతులకు రూ.1,460.96 కోట్లు, రాజస్థాన్లో 65,99,142 మంది రైతులకు రూ.1,319.84 కోట్లు, గుజరాత్లో 51,04,469 మంది రైతులకు రూ.1,021.14 కోట్లు, పశ్చిమ బెంగాల్లో 46,02,428 మంది రైతులకు రూ.924.83 కోట్లు, కర్ణాటకలో 41,30,436 మంది రైతులకు రూ.826.16 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 38,89,936 మంది రైతులకు రూ.777.99 కోట్లు, అలాగే తెలంగాణలో 30,10,267 మంది రైతులకు రూ.602.11 కోట్లు కేంద్ర ప్రభుత్వం PM-KISAN 23వ విడత కింద వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసింది.

