తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢ మాసం వచ్చిందంటే మహిళల చేతులు గోరింటాకు రంగులతో కళకళలాడిపోతాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వధువులు, వివాహితలు ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. చాలామంది దీనిని కేవలం అలంకరణలో భాగంగా భావించినప్పటికీ, ఆచారం వెనుక ఆరోగ్య, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కారణాలు కూడా ఉన్నాయని పండితులు, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

