ప్రభన్యూస్

ఖమ్మం కవికి అంతర్జాతీయ సాహిత్య పురస్కార ం.

ఖమ్మం కవికి అంతర్జాతీయ సాహిత్య పురస్కారం.

అమెరికాలో జరిగిన టిటిఏ మహాసభల్లో మంత్రిప్రగడ శ్రీనివాసరావుకు ద్వితీయ బహుమతి

ప్రభ న్యూస్, స్టేట్ బ్యూరో ,ఖమ్మం జూలై 20:

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత మంత్రిప్రగడ శ్రీనివాసరావు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన సాహిత్య పురస్కారాన్ని అందుకుని జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీటీఏ) ఆధ్వర్యంలో అమెరికాలోని నార్త్ కరోలినాలోని షార్లెట్ నగరంలో ఈ నెల 17 నుంచి 19 వరకు అత్యంత వైభవంగా నిర్వహించిన మెగా కన్వెన్షన్ మహాసభల్లో జరిగిన అంతర్జాతీయ సాహిత్య ఎక్సలెన్సీ అవార్డుల పోటీల్లో కవితల విభాగంలో ఆయన ద్వితీయ బహుమతిని సొంతం చేసుకున్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయితలు కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, జానపద గాన కోకిల డాక్టర్ అరుణ సుబ్బారావు, ప్రముఖ కార్డియాలజిస్ట్, సాహితీవేత్త డాక్టర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, టిటిఏ సాహిత్య సావనీర్ కమిటీ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, రాజశ్రీ తదితరుల చేతుల మీదుగా మంత్రిప్రగడ శ్రీనివాసరావు పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డుతో పాటు సుమారు రూ.9 వేల నగదు బహుమతిని కూడా ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.అమెరికాలో నివసిస్తున్న తన కుమార్తె, అల్లుడు, కుమారుడిని సందర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ఈ సాహిత్య పోటీల్లో పాల్గొన్న శ్రీనివాసరావు విజేతగా నిలిచి అంతర్జాతీయ వేదికపై పురస్కారం అందుకోవడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలుగు భాష, సాహిత్య వికాసానికి తెలంగాణ అమెరికా తెలుగు సంఘం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా లభించిన ఈ అరుదైన అవకాశం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో మరింత నిబద్ధతతో సాహిత్య సేవకు అంకితమవుతానని తెలిపారు.మంత్రిప్రగడ శ్రీనివాసరావు సాధించిన ఈ అంతర్జాతీయ గౌరవంపై సాహితీవేత్తలు, కవులు, అభిమానులు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 9:15 am Digital Edition : Prabhanews