ప్రభన్యూస్

Business Loan: వ్యాపారం చేసేవారికి ఎస్‌బీఐ బంపర్ ఆఫర్… కేవలం 45 నిమిషాల్లో రూ.50 కోట్ల వరకు రుణం | బిజినెస్


Last Updated:

Business Loan | చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి ఆస్తులను తనఖా పెట్టకుండానే ఇచ్చే ‘ఎంఎస్ఎంఈ డ్రీమ్’ లోన్ పరిమితిని రూ.50 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ కొత్త నిర్ణయంతో వ్యాపారులకు పెద్ద మొత్తంలో రుణాలు పొందడం మరింత సులభం కానుంది.

Business Loan: వ్యాపారం చేసేవారికి ఎస్‌బీఐ బంపర్ ఆఫర్... కేవలం 45 నిమిషాల్లో రూ.50 కోట్ల వరకు రుణం (ప్రతీకాత్మక చిత్రం)
Business Loan: వ్యాపారం చేసేవారికి ఎస్‌బీఐ బంపర్ ఆఫర్… కేవలం 45 నిమిషాల్లో రూ.50 కోట్ల వరకు రుణం (ప్రతీకాత్మక చిత్రం)

చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందేందుకు ఎస్‌బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఎలాంటి ఆస్తులను తనఖా పెట్టకుండానే డిజిటల్ విధానంలో రుణాలు అందించే ‘ఎంఎస్‌ఎంఈ డ్రీమ్’ స్కీమ్ కింద రుణ పరిమితిని భారీగా పెంచాలని నిర్ణయించింది. 2027 మార్చి నాటికి ఒక్కో రుణం మొత్తాన్ని రూ.50 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించింది. చిన్న వ్యాపారాలకు సులభంగా రుణాలు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద గరిష్ఠంగా రూ.5 కోట్ల వరకు రుణాలు ఇస్తున్నారు. 2023 డిసెంబర్‌లో ఈ ప్రొడక్ట్‌ను ప్రారంభించారు. అయితే, కొన్ని ఎంపిక చేసిన బ్రాంచ్‌లలో క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (సీయూజీ) విధానంలో రూ.10 కోట్ల వరకు రుణాలు అందిస్తున్నారు.

ఈ పరిమితిని అన్ని బ్రాంచ్‌లకు విస్తరించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. నవంబర్ 30 నాటికి అన్ని బ్రాంచ్‌లలో ఈ స్కీమ్ కింద గరిష్ఠ రుణ పరిమితిని రూ.10 కోట్లకు పెంచనుంది. అదే రోజు రూ.50 కోట్ల చొప్పున రుణాలు ఇచ్చేందుకు పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించనుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని బ్రాంచ్‌లలో ఒక్కో రుణం పరిమితిని రూ.50 కోట్లకు పెంచుతామని బ్యాంక్ అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: Affordable Housing: రూ.45 లక్షలు కాదు… రూ.90 లక్షలకు పెంచాలి… ఇళ్ల ధరలపై క్రెడాయ్ ప్రతిపాదన!

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ ఇప్పటివరకు ‘డ్రీమ్’ ప్రొడక్ట్ కింద మొత్తం రూ.2.25 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఈ రుణాల్లో మొండి బకాయిల సమస్య కూడా చాలా తక్కువగా ఉందని అధికారి చెప్పారు. ఈ స్కీమ్ కింద ఇచ్చిన రుణాలకు సంబంధించి గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌పీఏ) నిష్పత్తి 0.50 శాతం కంటే తక్కువగా ఉంది. అదే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) రంగానికి ఇచ్చిన సాధారణ రుణాల్లో ఈ నిష్పత్తి 1.50 శాతానికి పైనే ఉంది. అంటే, ఈ ప్రత్యేక స్కీమ్ కింద ఇచ్చిన రుణాల రికవరీ పరిస్థితి మెరుగ్గా ఉందని బ్యాంక్ చెబుతోంది.

ఈ స్కీమ్‌లో రుణం తీసుకోవాలనుకునే వ్యాపారులు ముందుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తమ వివరాలను నమోదు చేయాలి. వాటి ఆధారంగా రుణం తీసుకునే సామర్థ్యాన్ని, క్రెడిట్ అర్హతను బ్యాంక్ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే రుణం మంజూరవుతుందని అధికారి వివరించారు. గతంలో ఒక రుణం మంజూరై, డబ్బులు చేతికి అందడానికి దాదాపు నెల రోజులు పట్టేది. కానీ ఇప్పుడు డిజిటల్ విధానంలో వివరాలను సేకరించడం, పరిశీలించడం వల్ల ఈ సమయం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రుణం పంపిణీ ప్రక్రియను దాదాపు వారం రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Tata Punch EV EMI: నెలకు రూ.15 వేల ఈఎంఐతో టాటా పంచ్ ఈవీ మీ సొంతం!

మొత్తంగా చూస్తే, ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు పెద్ద మొత్తంలో రుణాలు పొందడం మరింత సులభం కానుంది. ముఖ్యంగా ఆస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం లేకుండా, వేగంగా రుణాలు పొందే అవకాశం ఈ స్కీమ్ ద్వారా లభించనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 3:54 pm Digital Edition : Prabhanews
Business Loan: వ్యాపారం చేసేవారికి ఎస్‌బీఐ బంపర్ ఆఫర్… కేవలం 45 నిమిషాల్లో రూ.50 కోట్ల వరకు రుణం | బిజినెస్

Last Updated:November 27, 2026 2:34 PM ISTBusiness Loan | చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి ఆస్తులను తనఖా పెట్టకుండానే ఇచ్చే 'ఎంఎస్ఎంఈ డ్రీమ్' లోన్ పరిమితిని రూ.50 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ కొత్త నిర్ణయంతో వ్యాపారులకు పెద్ద మొత్తంలో రుణాలు పొందడం మరింత సులభం కానుంది.Business Loan: వ్యాపారం చేసేవారికి ఎస్‌బీఐ బంపర్ ఆఫర్... కేవలం 45 నిమిషాల్లో రూ.50 కోట్ల వరకు రుణం (ప్రతీకాత్మక చిత్రం)చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందేందుకు ఎస్‌బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఎలాంటి ఆస్తులను తనఖా పెట్టకుండానే డిజిటల్ విధానంలో రుణాలు అందించే 'ఎంఎస్‌ఎంఈ డ్రీమ్' స్కీమ్ కింద రుణ పరిమితిని భారీగా పెంచాలని నిర్ణయించింది. 2027 మార్చి నాటికి ఒక్కో రుణం మొత్తాన్ని రూ.50 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించింది. చిన్న వ్యాపారాలకు సులభంగా రుణాలు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద గరిష్ఠంగా రూ.5 కోట్ల వరకు రుణాలు ఇస్తున్నారు. 2023 డిసెంబర్‌లో ఈ ప్రొడక్ట్‌ను ప్రారంభించారు. అయితే, కొన్ని ఎంపిక చేసిన బ్రాంచ్‌లలో క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (సీయూజీ) విధానంలో రూ.10 కోట్ల వరకు రుణాలు అందిస్తున్నారు.ఈ పరిమితిని అన్ని బ్రాంచ్‌లకు విస్తరించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. నవంబర్ 30 నాటికి అన్ని బ్రాంచ్‌లలో ఈ స్కీమ్ కింద గరిష్ఠ రుణ పరిమితిని రూ.10 కోట్లకు పెంచనుంది. అదే రోజు రూ.50 కోట్ల చొప్పున రుణాలు ఇచ్చేందుకు పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించనుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని బ్రాంచ్‌లలో ఒక్కో రుణం పరిమితిని రూ.50 కోట్లకు పెంచుతామని బ్యాంక్ అధికారి తెలిపారు.ఇది కూడా చదవండి: Affordable Housing: రూ.45 లక్షలు కాదు... రూ.90 లక్షలకు పెంచాలి... ఇళ్ల ధరలపై క్రెడాయ్ ప్రతిపాదన!దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ ఇప్పటివరకు 'డ్రీమ్' ప్రొడక్ట్ కింద మొత్తం రూ.2.25 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఈ రుణాల్లో మొండి బకాయిల సమస్య కూడా చాలా తక్కువగా ఉందని అధికారి చెప్పారు. ఈ స్కీమ్ కింద ఇచ్చిన రుణాలకు సంబంధించి గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌పీఏ) నిష్పత్తి 0.50 శాతం కంటే తక్కువగా ఉంది. అదే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) రంగానికి ఇచ్చిన సాధారణ రుణాల్లో ఈ నిష్పత్తి 1.50 శాతానికి పైనే ఉంది. అంటే, ఈ ప్రత్యేక స్కీమ్ కింద ఇచ్చిన రుణాల రికవరీ పరిస్థితి మెరుగ్గా ఉందని బ్యాంక్ చెబుతోంది.ఈ స్కీమ్‌లో రుణం తీసుకోవాలనుకునే వ్యాపారులు ముందుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తమ వివరాలను నమోదు చేయాలి. వాటి ఆధారంగా రుణం తీసుకునే సామర్థ్యాన్ని, క్రెడిట్ అర్హతను బ్యాంక్ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే రుణం మంజూరవుతుందని అధికారి వివరించారు. గతంలో ఒక రుణం మంజూరై, డబ్బులు చేతికి అందడానికి దాదాపు నెల రోజులు పట్టేది. కానీ ఇప్పుడు డిజిటల్ విధానంలో వివరాలను సేకరించడం, పరిశీలించడం వల్ల ఈ సమయం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రుణం పంపిణీ ప్రక్రియను దాదాపు వారం రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Tata Punch EV EMI: నెలకు రూ.15 వేల ఈఎంఐతో టాటా పంచ్ ఈవీ మీ సొంతం!మొత్తంగా చూస్తే, ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు పెద్ద మొత్తంలో రుణాలు పొందడం మరింత సులభం కానుంది. ముఖ్యంగా ఆస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం లేకుండా, వేగంగా రుణాలు పొందే అవకాశం ఈ స్కీమ్ ద్వారా లభించనుంది.మరింత చదవండి

Source link