ప్రభన్యూస్

School: కొత్త తరహా స్కూల్.. చదువు పూర్తయ్యాక సీటు రాకపోతే డబ్బులు వెనక్కి! ఇదెక్కడి స్కూలంటే? |


Last Updated:

సాధారణంగా స్కూల్ ఫీజు కడితే పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని ఆశిస్తారు. కానీ అమెరికాలోని ఓ ప్రైవేట్ పాఠశాల మాత్రం అంతకుమించి హామీ ఇస్తోంది.

News18
News18

పిల్లలను ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదివించాలనేది చాలామంది తల్లిదండ్రుల కల. ముఖ్యంగా అమెరికాలోని ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించడం కోసం లక్షల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అమెరికాలో ఓ ప్రైవేట్ హైస్కూల్ వినూత్న పథకంతో ముందుకొచ్చింది. ఏడాదికి 1.5 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.1.3 కోట్లు) ఫీజు వసూలు చేస్తూ, విద్యార్థికి టాప్-20 యూనివర్సిటీలో ప్రవేశం కల్పించకపోతే డబ్బులు తిరిగి ఇస్తామని హామీ ఇస్తోంది. క్రిమ్సన్ ఎడ్యుకేషన్, ఏఐ ఆధారిత ప్రైవేట్ పాఠశాలల సంస్థ ఆల్ఫా స్కూల్ కలిసి ‘ఆల్ఫా క్రిమ్సన్ స్కూల్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.

నాలుగేళ్ల చదువుకు రూ.5 కోట్లకుపైగా

ఈ పాఠశాలలో నాలుగేళ్ల హైస్కూల్ విద్యకు మొత్తం 6 లక్షల డాలర్లు ఖర్చవుతుంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.5 కోట్లకు పైగా. అయితే ఫీజు తిరిగి పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. విద్యార్థి నాలుగేళ్లూ అదే పాఠశాలలో చదవాలి. పోటీతత్వానికి తగిన స్థాయిలో SAT స్కోరు సాధించినప్పటికీ టాప్-20 యూనివర్సిటీలో ప్రవేశం పొందకూడదు. అలాగే ఆ విద్యార్థి చదివిన బ్యాచ్‌లో 75 శాతం కంటే తక్కువ మందికే టాప్-20 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు లభించాలి. విద్యార్థి కష్టపడి చదవకుండా, పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉంటే డబ్బులు తిరిగి ఇవ్వబోమని ఆల్ఫా సహ వ్యవస్థాపకురాలు మెకెంజీ ప్రైస్ స్పష్టం చేశారు.

ఏఐతో ప్రత్యేక బోధన

2014లో ప్రారంభమైన ఆల్ఫా స్కూల్ ఇప్పటివరకు 42 ప్రాంతాల్లో తన విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 27 కేంద్రాలు గత ఏడాదిలోనే ప్రారంభమయ్యాయి. ఈ సంస్థ ప్రధానంగా కేజీ నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యను అందిస్తోంది. విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ ట్యూటర్ల ద్వారా బోధన చేస్తోంది. సంప్రదాయ పాఠశాలలతో పోలిస్తే పిల్లలు రెండింతల వేగంతో నేర్చుకుంటారని సంస్థ చెబుతోంది. తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు రోజుకు మూడు గంటలు మాత్రమే ప్రధాన విద్యాభ్యాసానికి కేటాయిస్తారు. మిగిలిన సమయాన్ని వ్యక్తిగత ఆసక్తులు, నైపుణ్యాల అభివృద్ధికి వినియోగిస్తారు. క్రిమ్సన్ కౌన్సిలర్లు యూనివర్సిటీ ప్రవేశాలకు అవసరమైన ప్రాజెక్టులు, ఆవిష్కరణలు, లాభాపేక్షలేని సంస్థల కార్యక్రమాల్లో విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు.

విద్యారంగంలో పెరుగుతున్న పోటీ

ఇలాంటి హామీలను ఇతర విద్యాసంస్థలు కూడా అందిస్తున్నాయి. ప్రిన్స్‌టన్ రివ్యూ 2014లో పరీక్షల మార్కుల మెరుగుదలకు మనీబ్యాక్ హామీ ప్రారంభించింది. కాలిఫోర్నియాకు చెందిన జెనిత్ ప్రిప్ అకాడమీ 2022 నుంచి ఇలాంటి పథకాన్ని అమలు చేస్తోంది. ఫ్లోరిడా 2021లో ఆరు ప్రభుత్వ కళాశాల కోర్సులకు ఉద్యోగ హామీతో కూడిన ఫీజు వాపసు విధానాన్ని తీసుకొచ్చింది. మరోవైపు ఆల్ఫా క్రిమ్సన్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, మియామీ సహా ఏడు ప్రాంతాల్లో గరిష్ఠంగా 100 మంది విద్యార్థులతో ప్రారంభం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటికే ప్రతిభ ఉన్న విద్యార్థులను ఎంపిక చేయడమే ఈ పాఠశాల విజయానికి కారణమా? లేక ఏఐ బోధనా విధానమా? అనే ప్రశ్నలతో విద్యారంగ నిపుణులు ఈ విధానాన్ని పరిశీలిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 November 2026, 1:03 pm Digital Edition : Prabhanews
School: కొత్త తరహా స్కూల్.. చదువు పూర్తయ్యాక సీటు రాకపోతే డబ్బులు వెనక్కి! ఇదెక్కడి స్కూలంటే? |

Last Updated:November 26, 2026 1:02 PM ISTసాధారణంగా స్కూల్ ఫీజు కడితే పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని ఆశిస్తారు. కానీ అమెరికాలోని ఓ ప్రైవేట్ పాఠశాల మాత్రం అంతకుమించి హామీ ఇస్తోంది.
News18పిల్లలను ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదివించాలనేది చాలామంది తల్లిదండ్రుల కల. ముఖ్యంగా అమెరికాలోని ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించడం కోసం లక్షల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అమెరికాలో ఓ ప్రైవేట్ హైస్కూల్ వినూత్న పథకంతో ముందుకొచ్చింది. ఏడాదికి 1.5 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.1.3 కోట్లు) ఫీజు వసూలు చేస్తూ, విద్యార్థికి టాప్-20 యూనివర్సిటీలో ప్రవేశం కల్పించకపోతే డబ్బులు తిరిగి ఇస్తామని హామీ ఇస్తోంది. క్రిమ్సన్ ఎడ్యుకేషన్, ఏఐ ఆధారిత ప్రైవేట్ పాఠశాలల సంస్థ ఆల్ఫా స్కూల్ కలిసి 'ఆల్ఫా క్రిమ్సన్ స్కూల్' పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.నాలుగేళ్ల చదువుకు రూ.5 కోట్లకుపైగాఈ పాఠశాలలో నాలుగేళ్ల హైస్కూల్ విద్యకు మొత్తం 6 లక్షల డాలర్లు ఖర్చవుతుంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.5 కోట్లకు పైగా. అయితే ఫీజు తిరిగి పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. విద్యార్థి నాలుగేళ్లూ అదే పాఠశాలలో చదవాలి. పోటీతత్వానికి తగిన స్థాయిలో SAT స్కోరు సాధించినప్పటికీ టాప్-20 యూనివర్సిటీలో ప్రవేశం పొందకూడదు. అలాగే ఆ విద్యార్థి చదివిన బ్యాచ్‌లో 75 శాతం కంటే తక్కువ మందికే టాప్-20 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు లభించాలి. విద్యార్థి కష్టపడి చదవకుండా, పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉంటే డబ్బులు తిరిగి ఇవ్వబోమని ఆల్ఫా సహ వ్యవస్థాపకురాలు మెకెంజీ ప్రైస్ స్పష్టం చేశారు.ఏఐతో ప్రత్యేక బోధన2014లో ప్రారంభమైన ఆల్ఫా స్కూల్ ఇప్పటివరకు 42 ప్రాంతాల్లో తన విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 27 కేంద్రాలు గత ఏడాదిలోనే ప్రారంభమయ్యాయి. ఈ సంస్థ ప్రధానంగా కేజీ నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యను అందిస్తోంది. విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ ట్యూటర్ల ద్వారా బోధన చేస్తోంది. సంప్రదాయ పాఠశాలలతో పోలిస్తే పిల్లలు రెండింతల వేగంతో నేర్చుకుంటారని సంస్థ చెబుతోంది. తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు రోజుకు మూడు గంటలు మాత్రమే ప్రధాన విద్యాభ్యాసానికి కేటాయిస్తారు. మిగిలిన సమయాన్ని వ్యక్తిగత ఆసక్తులు, నైపుణ్యాల అభివృద్ధికి వినియోగిస్తారు. క్రిమ్సన్ కౌన్సిలర్లు యూనివర్సిటీ ప్రవేశాలకు అవసరమైన ప్రాజెక్టులు, ఆవిష్కరణలు, లాభాపేక్షలేని సంస్థల కార్యక్రమాల్లో విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు.విద్యారంగంలో పెరుగుతున్న పోటీఇలాంటి హామీలను ఇతర విద్యాసంస్థలు కూడా అందిస్తున్నాయి. ప్రిన్స్‌టన్ రివ్యూ 2014లో పరీక్షల మార్కుల మెరుగుదలకు మనీబ్యాక్ హామీ ప్రారంభించింది. కాలిఫోర్నియాకు చెందిన జెనిత్ ప్రిప్ అకాడమీ 2022 నుంచి ఇలాంటి పథకాన్ని అమలు చేస్తోంది. ఫ్లోరిడా 2021లో ఆరు ప్రభుత్వ కళాశాల కోర్సులకు ఉద్యోగ హామీతో కూడిన ఫీజు వాపసు విధానాన్ని తీసుకొచ్చింది. మరోవైపు ఆల్ఫా క్రిమ్సన్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, మియామీ సహా ఏడు ప్రాంతాల్లో గరిష్ఠంగా 100 మంది విద్యార్థులతో ప్రారంభం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటికే ప్రతిభ ఉన్న విద్యార్థులను ఎంపిక చేయడమే ఈ పాఠశాల విజయానికి కారణమా? లేక ఏఐ బోధనా విధానమా? అనే ప్రశ్నలతో విద్యారంగ నిపుణులు ఈ విధానాన్ని పరిశీలిస్తున్నారు.మరింత చదవండి

Source link