టాలీవుడ్ సీనియర్ నటుడు విజయకృష్ణ నరేష్ వెండితెరపై తనదైన నటనతోనే కాకుండా, వందల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి అధిపతిగానూ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. దిగ్గజ నటి, దర్శకురాలు దివంగత విజయనిర్మల కుమారుడిగా, సూపర్ స్టార్ కృష్ణ అడుగుజాడల్లో బాలనటుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆయన, 80వ దశకంలో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలతో అద్భుతమైన కామెడీ టైమింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘పెళ్ళిచూపులు’, ‘సమాజవరగమన’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నేటి తరం ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు.

