మీరు మీ కరెంట్ బిల్ల తగ్గించుకోవాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీ ఇంటిపైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే నెల నెలా కరెంట్ బిల్ కట్టాల్సిన పని ఉండకపోవచ్చు. అయితే చాలా మందికి సోలార్ ప్యానెళ్లు పెట్టుకోవాలంటే రకరకాల డౌట్స్ ఉంటాయి. సోలార్ ప్యానెళ్లు ఇంటిపైన పెడితే ఎండ ఉన్నప్పుడు మాత్రమే పవర్ జనరేట్ అవుతుంది, వర్షాలు, శీతాకాలంలో ఉత్పత్తి చేయవని భావిస్తారు. కానీ అది నిజం కాదు. సూర్యరశ్మి అందుబాటులో ఉన్నంత వరకు వేసవి, వర్షాకాలం, శీతాకాలం.. ఇలా అన్ని కాలాల్లోనూ సోలార్ ప్యానెళ్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన కూడా ఇదే విషయాన్ని ప్రజలకు వివరిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)

