ప్రభన్యూస్

Prabhas: పెదనాన్న కృష్ణంరాజు సినిమాపై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్.. ఎందుకంటే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

తన పెదనాన్న, దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రం ‘భక్త కన్నప్ప’కు 57వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో (ఇఫీ) అరుదైన గౌరవం దక్కడం పట్ల ప్రభాస్ హర్షం వ్యక్తం చేశారు.

News18
News18

ఎన్ని సంవత్సరాలు గడిచినా కొన్ని గొప్ప కథలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్నారు. తన పెదనాన్న, దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రం ‘భక్త కన్నప్ప’కు 57వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో (ఇఫీ) అరుదైన గౌరవం దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కళాతపస్వి బాపు దర్శకత్వంలో, గోపీకృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణంరాజు మరియు తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ‘ఇఫీ’ వేదికపై ప్రదర్శితం కావడంపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగంగా స్పందించారు.

ఈ సందర్భంగా ప్రభాస్ తన పోస్ట్‌లో.. “నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన సినిమా ఇది. పెదనాన్న నటించి, గోపీకృష్ణ మూవీస్ నిర్మించిన ఈ అద్భుత చిత్రానికి బాపు గారు ప్రాణం పోశారు. ఏళ్లు గడిచినా కొన్ని కథలు ఎప్పటికీ నిత్యనూతనంగానే ఉంటాయి. ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని ఇఫీలో వేడుకగా జరుపుకుంటున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇది ఒక అందమైన వారసత్వం, మాకు దక్కిన నిజమైన గౌరవం” అని పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మైలురాయిగా నిలిచిన ఈ క్లాసిక్ చిత్రం విడుదలై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఇఫీలో దీనిని ప్రత్యేకంగా ప్రదర్శిస్తుండటం విశేషం.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. వాటిలో ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఫౌజీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది.

భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో పాటు మరో పాన్ ఇండియా మూవీ స్పిరిట్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారీ ఎత్తున ఈ సినిమా రూపొందుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 4:40 pm Digital Edition : Prabhanews
Prabhas: పెదనాన్న కృష్ణంరాజు సినిమాపై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్.. ఎందుకంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 21, 2026 4:39 PM ISTతన పెదనాన్న, దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రం ‘భక్త కన్నప్ప’కు 57వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో (ఇఫీ) అరుదైన గౌరవం దక్కడం పట్ల ప్రభాస్ హర్షం వ్యక్తం చేశారు.News18ఎన్ని సంవత్సరాలు గడిచినా కొన్ని గొప్ప కథలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్నారు. తన పెదనాన్న, దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రం ‘భక్త కన్నప్ప’కు 57వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో (ఇఫీ) అరుదైన గౌరవం దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కళాతపస్వి బాపు దర్శకత్వంలో, గోపీకృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణంరాజు మరియు తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ‘ఇఫీ’ వేదికపై ప్రదర్శితం కావడంపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగంగా స్పందించారు.ఈ సందర్భంగా ప్రభాస్ తన పోస్ట్‌లో.. "నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన సినిమా ఇది. పెదనాన్న నటించి, గోపీకృష్ణ మూవీస్ నిర్మించిన ఈ అద్భుత చిత్రానికి బాపు గారు ప్రాణం పోశారు. ఏళ్లు గడిచినా కొన్ని కథలు ఎప్పటికీ నిత్యనూతనంగానే ఉంటాయి. ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని ఇఫీలో వేడుకగా జరుపుకుంటున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇది ఒక అందమైన వారసత్వం, మాకు దక్కిన నిజమైన గౌరవం" అని పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మైలురాయిగా నిలిచిన ఈ క్లాసిక్ చిత్రం విడుదలై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఇఫీలో దీనిని ప్రత్యేకంగా ప్రదర్శిస్తుండటం విశేషం.ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. వాటిలో ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఫౌజీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది.భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో పాటు మరో పాన్ ఇండియా మూవీ స్పిరిట్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారీ ఎత్తున ఈ సినిమా రూపొందుతోంది.మరింత చదవండి

Source link