ప్రభన్యూస్

Bandla Ganesh: జైలు శిక్షపై బండ్ల గణేశ్ రియాక్షన్.. ఏమన్నారంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

Bandla Ganesh: చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.90 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పుపై స్పందించిన ఆయన భారత న్యాయవ్యవస్థపై తనకున్న గౌరవాన్ని వెల్లడించారు.

News18
News18

Bandla Ganesh: ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.90 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. రూ.95 లక్షల అప్పు తిరిగి చెల్లించే క్రమంలో ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఈ కేసు నమోదైంది.

ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తనకు విధించిన జైలు శిక్షపై బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారత న్యాయవ్యవస్థపై తనకున్న గౌరవాన్ని తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు.

‘భారత న్యాయవ్యవస్థపై నాకు అపారమైన గౌరవం ఉంది. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం కోరేందుకు మన రాజ్యాంగం అవకాశం కల్పించింది. చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడమే నా నమ్మకం’ అని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.

తన ట్వీట్‌లో న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన.. చట్టపరమైన మార్గాల్లోనే ముందుకు సాగుతాననే అభిప్రాయాన్ని వెల్లడించారు. కోర్టు తీర్పుపై అనవసర వ్యాఖ్యలు చేయకుండా, న్యాయవ్యవస్థపై తనకున్న గౌరవాన్ని స్పష్టం చేశారు.

మొత్తానికి చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.90 లక్షల జరిమానా విధించడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ తీర్పుపై ఆయన చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 November 2026, 10:08 pm Digital Edition : Prabhanews
Bandla Ganesh: జైలు శిక్షపై బండ్ల గణేశ్ రియాక్షన్.. ఏమన్నారంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 18, 2026 9:59 PM ISTBandla Ganesh: చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.90 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పుపై స్పందించిన ఆయన భారత న్యాయవ్యవస్థపై తనకున్న గౌరవాన్ని వెల్లడించారు.News18Bandla Ganesh: ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.90 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. రూ.95 లక్షల అప్పు తిరిగి చెల్లించే క్రమంలో ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఈ కేసు నమోదైంది.ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తనకు విధించిన జైలు శిక్షపై బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారత న్యాయవ్యవస్థపై తనకున్న గౌరవాన్ని తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు.'భారత న్యాయవ్యవస్థపై నాకు అపారమైన గౌరవం ఉంది. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం కోరేందుకు మన రాజ్యాంగం అవకాశం కల్పించింది. చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడమే నా నమ్మకం' అని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.తన ట్వీట్‌లో న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన.. చట్టపరమైన మార్గాల్లోనే ముందుకు సాగుతాననే అభిప్రాయాన్ని వెల్లడించారు. కోర్టు తీర్పుపై అనవసర వ్యాఖ్యలు చేయకుండా, న్యాయవ్యవస్థపై తనకున్న గౌరవాన్ని స్పష్టం చేశారు.మొత్తానికి చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.90 లక్షల జరిమానా విధించడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ తీర్పుపై ఆయన చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.మరింత చదవండి

Source link