ప్రభన్యూస్

Chiru Leaks: ‘కాకా’ లీక్ చేసేశాడు.. చిరంజీవి స్టేజ్ ఎక్కితే ఇలాగే ఉంటుంది మరి!! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘కాకా’ చిత్రంపై టాలీవుడ్ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘కాకా’కు సంబంధించి ఓ లీక్ ఇచ్చేశాడు చిరు.

News18
News18

నేటితరం యువ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన బాబీ (KS Ravindra) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కాకా’లో చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో, ఇప్పుడు రాబోతున్న ‘కాకా’ చిత్రంపై టాలీవుడ్ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘కాకా’కు సంబంధించి ఓ లీక్ ఇచ్చేశాడు చిరు.

తాజాగా ‘ఇట్లు అర్జున’ సినిమా సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. తనదైన శైలిలో మాట్లాడుతూ ‘కాకా’ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని, సినిమాలోని కీలకమైన సస్పెన్స్‌ను పరోక్షంగా రివీల్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తెగా యువ నటి అనస్వర రాజన్ (Anaswara Rajan) నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సక్సెస్ మీట్ వేదికపై అనస్వర పాత్ర గురించి చిరు మాట్లాడుతూ ప్రేక్షకులకు హింట్ ఇచ్చేశారు.

‘‘కాకా’ సినిమాలో అనస్వర అద్భుతంగా నటించింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ పండింది. ‘అనస్వర.. నువ్వేమైనా నీ పాత్ర గురించి మాట్లాడతావా?’” అని అడిగిన చిరు, వెంటనే ఆయనే బదులిస్తూ.. “తను మాట్లాడదు.. అసలు మాట్లాడలేదు. మాట్లాడడం ఆమెకు అస్సలు నచ్చదు. నేను చెప్పిన ఈ లైన్‌ను మీరు ఇంటికి వెళ్లాక బాగా గుర్తుచేసుకుని ఆలోచించండి. అప్పుడు అసలు విషయం ఏంటో మీకే అర్థమవుతుంది’’ అంటూ నవ్వేశారు. చిరు ఆ మాట అనగానే పక్కనే ఉన్న అనస్వర ‘సర్‌ మీరు సినిమా సస్పెన్స్‌ లీక్‌ చేసేశారు’ అన్నట్లుగా ఇచ్చిన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌ అందరినీ ఆకట్టుకుంది.

దీంతో ఈ సినిమాలో అనస్వర మూగ అమ్మాయి పాత్రలో నటిస్తుందంటూ ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలకు గట్టి బలం చేకూరింది. సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వచ్చే ఏడాది జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఇదే వేదికపై యువ దర్శకుడు వెంకీ కుడుముల గురించి చిరంజీవి చేసిన ఫన్నీ కామెంట్స్‌ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. వెంకీ తీసే సినిమాల్లోని కామెడీ సెన్స్‌ తనకు చాలా ఇష్టమని మెగాస్టార్ చెప్పారు. ‘‘నేను సాధారణంగా ఎవరినీ నాతో సినిమా చేస్తావా అని అడగలేదు. కానీ, వెంకీని మాత్రం నేనే అడిగాను. మంచి కథతో వస్తాను సర్‌ అన్నాడు. నేను చకోర పక్షిలా ఆ కథ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. కానీ, ఇప్పటి వరకూ రాలేదు. నాకు హ్యాండ్‌ ఇచ్చి, ఇప్పుడు ‘ఇట్లు అర్జున’ చిత్రానికి నిర్మాతగా అవతారం ఎత్తాడు’’ అని సరదాగా ఆటపట్టించారు చిరంజీవి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 November 2026, 10:52 am Digital Edition : Prabhanews
Chiru Leaks: ‘కాకా’ లీక్ చేసేశాడు.. చిరంజీవి స్టేజ్ ఎక్కితే ఇలాగే ఉంటుంది మరి!! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 18, 2026 10:41 AM ISTచిరంజీవి హీరోగా రూపొందుతున్న 'కాకా' చిత్రంపై టాలీవుడ్ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘కాకా’కు సంబంధించి ఓ లీక్ ఇచ్చేశాడు చిరు. News18నేటితరం యువ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన బాబీ (KS Ravindra) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'కాకా'లో చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో, ఇప్పుడు రాబోతున్న 'కాకా' చిత్రంపై టాలీవుడ్ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘కాకా’కు సంబంధించి ఓ లీక్ ఇచ్చేశాడు చిరు.తాజాగా 'ఇట్లు అర్జున' సినిమా సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. తనదైన శైలిలో మాట్లాడుతూ 'కాకా' చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని, సినిమాలోని కీలకమైన సస్పెన్స్‌ను పరోక్షంగా రివీల్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తెగా యువ నటి అనస్వర రాజన్ (Anaswara Rajan) నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సక్సెస్ మీట్ వేదికపై అనస్వర పాత్ర గురించి చిరు మాట్లాడుతూ ప్రేక్షకులకు హింట్ ఇచ్చేశారు.‘‘కాకా’ సినిమాలో అనస్వర అద్భుతంగా నటించింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ పండింది. ‘అనస్వర.. నువ్వేమైనా నీ పాత్ర గురించి మాట్లాడతావా?’" అని అడిగిన చిరు, వెంటనే ఆయనే బదులిస్తూ.. "తను మాట్లాడదు.. అసలు మాట్లాడలేదు. మాట్లాడడం ఆమెకు అస్సలు నచ్చదు. నేను చెప్పిన ఈ లైన్‌ను మీరు ఇంటికి వెళ్లాక బాగా గుర్తుచేసుకుని ఆలోచించండి. అప్పుడు అసలు విషయం ఏంటో మీకే అర్థమవుతుంది’’ అంటూ నవ్వేశారు. చిరు ఆ మాట అనగానే పక్కనే ఉన్న అనస్వర ‘సర్‌ మీరు సినిమా సస్పెన్స్‌ లీక్‌ చేసేశారు’ అన్నట్లుగా ఇచ్చిన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌ అందరినీ ఆకట్టుకుంది.దీంతో ఈ సినిమాలో అనస్వర మూగ అమ్మాయి పాత్రలో నటిస్తుందంటూ ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలకు గట్టి బలం చేకూరింది. సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వచ్చే ఏడాది జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.ఇదే వేదికపై యువ దర్శకుడు వెంకీ కుడుముల గురించి చిరంజీవి చేసిన ఫన్నీ కామెంట్స్‌ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. వెంకీ తీసే సినిమాల్లోని కామెడీ సెన్స్‌ తనకు చాలా ఇష్టమని మెగాస్టార్ చెప్పారు. ‘‘నేను సాధారణంగా ఎవరినీ నాతో సినిమా చేస్తావా అని అడగలేదు. కానీ, వెంకీని మాత్రం నేనే అడిగాను. మంచి కథతో వస్తాను సర్‌ అన్నాడు. నేను చకోర పక్షిలా ఆ కథ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. కానీ, ఇప్పటి వరకూ రాలేదు. నాకు హ్యాండ్‌ ఇచ్చి, ఇప్పుడు ‘ఇట్లు అర్జున’ చిత్రానికి నిర్మాతగా అవతారం ఎత్తాడు’’ అని సరదాగా ఆటపట్టించారు చిరంజీవి.మరింత చదవండి

Source link