ప్రభన్యూస్

Chiranjeevi: చిరంజీవి ‘విశ్వంభర’ v/s ‘కాకా’.. ముందు ఏది రిలీజ్..? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న సినిమాల్లో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు ‘విశ్వంభర’, ‘కాకా’.

News18
News18

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న సినిమాల్లో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు ‘విశ్వంభర’, ‘కాకా’. ఇందులో ‘విశ్వంభర’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు తనకు బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు కొల్లి బాబీతో ‘కాకా’ సినిమా చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంలో ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

నిజానికి ‘విశ్వంభర’ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించిన పనులు ఆశించిన స్థాయిలో పూర్తి కావాల్సి ఉండటంతో విడుదల విషయంలో ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై మెగాస్టార్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా, దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

మరోవైపు చిరంజీవి, దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘కాకా’ కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో చిరంజీవికి ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన బాబీ.. ఈసారి మెగాస్టార్‌ను ఎలాంటి కథతో చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం కూడా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయంలోనే ఇప్పుడు అసలు సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవైపు ‘విశ్వంభర’ సినిమా బిజినెస్‌కు సంబంధించిన వ్యవహారాలు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. మరోవైపు ‘కాకా’ సినిమాకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ కూడా పూర్తయినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో రెండు సినిమాల విడుదలకు సంబంధించిన పనులు సమాంతరంగా జరుగుతున్నాయనే చర్చ మొదలైంది.

అయితే ‘విశ్వంభర’ సినిమా బిజినెస్ ఇంకా పూర్తిస్థాయిలో ముగియాల్సి ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్, ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ హక్కులతో పాటు నాన్ థియేట్రికల్ విభాగంలో శాటిలైట్ హక్కులకు సంబంధించిన వ్యవహారాలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలు పూర్తయిన తర్వాతే విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాను సంక్రాంతికి ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ‘కాకా’ కంటే ముందుగా ‘విశ్వంభర’ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ‘కాకా’ సినిమా బిజినెస్ కూడా పూర్తయినట్లు వార్తలు రావడంతో ఏ సినిమా ముందుగా విడుదలవుతుందనే ప్రశ్నకు ఇప్పట్లో సమాధానం దొరికేలా కనిపించడం లేదు.

మొత్తానికి మెగాస్టార్ అభిమానులకు ప్రస్తుతం రెండు సినిమాల రూపంలో డబుల్ ట్రీట్ ఎదురుచూస్తోంది. కానీ ఈ రెండు చిత్రాల్లో ముందుగా థియేటర్లలోకి వచ్చేది ఏది? ‘విశ్వంభర’ విడుదల తేదీ ముందుగా ఖరారవుతుందా? లేక ‘కాకా’ రిలీజ్‌పై ప్రకటన వస్తుందా? అనేది అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 9:24 pm Digital Edition : Prabhanews
Chiranjeevi: చిరంజీవి ‘విశ్వంభర’ v/s ‘కాకా’.. ముందు ఏది రిలీజ్..? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 17, 2026 9:11 PM ISTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న సినిమాల్లో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు ‘విశ్వంభర’, ‘కాకా’. News18మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న సినిమాల్లో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు ‘విశ్వంభర’, ‘కాకా’. ఇందులో ‘విశ్వంభర’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు తనకు బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు కొల్లి బాబీతో ‘కాకా’ సినిమా చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంలో ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.నిజానికి ‘విశ్వంభర’ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించిన పనులు ఆశించిన స్థాయిలో పూర్తి కావాల్సి ఉండటంతో విడుదల విషయంలో ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై మెగాస్టార్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా, దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.మరోవైపు చిరంజీవి, దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘కాకా’ కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో చిరంజీవికి ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన బాబీ.. ఈసారి మెగాస్టార్‌ను ఎలాంటి కథతో చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం కూడా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ఇక ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయంలోనే ఇప్పుడు అసలు సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవైపు ‘విశ్వంభర’ సినిమా బిజినెస్‌కు సంబంధించిన వ్యవహారాలు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. మరోవైపు ‘కాకా’ సినిమాకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ కూడా పూర్తయినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో రెండు సినిమాల విడుదలకు సంబంధించిన పనులు సమాంతరంగా జరుగుతున్నాయనే చర్చ మొదలైంది.అయితే ‘విశ్వంభర’ సినిమా బిజినెస్ ఇంకా పూర్తిస్థాయిలో ముగియాల్సి ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్, ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ హక్కులతో పాటు నాన్ థియేట్రికల్ విభాగంలో శాటిలైట్ హక్కులకు సంబంధించిన వ్యవహారాలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలు పూర్తయిన తర్వాతే విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇక ఈ సినిమాను సంక్రాంతికి ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ‘కాకా’ కంటే ముందుగా ‘విశ్వంభర’ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ‘కాకా’ సినిమా బిజినెస్ కూడా పూర్తయినట్లు వార్తలు రావడంతో ఏ సినిమా ముందుగా విడుదలవుతుందనే ప్రశ్నకు ఇప్పట్లో సమాధానం దొరికేలా కనిపించడం లేదు.మొత్తానికి మెగాస్టార్ అభిమానులకు ప్రస్తుతం రెండు సినిమాల రూపంలో డబుల్ ట్రీట్ ఎదురుచూస్తోంది. కానీ ఈ రెండు చిత్రాల్లో ముందుగా థియేటర్లలోకి వచ్చేది ఏది? ‘విశ్వంభర’ విడుదల తేదీ ముందుగా ఖరారవుతుందా? లేక ‘కాకా’ రిలీజ్‌పై ప్రకటన వస్తుందా? అనేది అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.మరింత చదవండి

Source link