ప్రభన్యూస్

Renu Desai: ఆయన లెవెల్ వేరు, ఇదంతా దైవ సంకల్పం.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

లేటెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటి రేణూ దేశాయ్ మాట్లాడిన తీరు, ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

News18
News18

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, టాలెంటెడ్ హీరోయిన్లు సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం’ (O.M). వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నటి రేణూ దేశాయ్ తన కుమార్తె ఆద్యతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాలా కాలం తర్వాత వెండితెరపై ఒక కీలక పాత్రలో కనిపించనున్న రేణూ దేశాయ్.. వేదికపై మాట్లాడుతూ తన సినిమా ప్రయాణాన్ని, షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

ఇది దైవిక సంకల్పం:

ఈ సినిమాలో అవకాశం రావడం వెనుక ఉన్న ఒక ఆధ్యాత్మిక కోణాన్ని అభిమానులతో పంచుకున్నారు రేణూ దేశాయ్. “ఈ ఫిబ్రవరిలో మహాశివరాత్రి పర్వదినాన నేను అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్య అమ్మవారి దర్శనంలో ఉన్నాను. సరిగ్గా ఆ సమయంలోనే ఈ సినిమా కోసం నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఒకవైపు మహాశివరాత్రి పవిత్ర దినం, కామాఖ్య క్షేత్రంలో ఉండటం, దానికి తోడు సినిమా పేరు కూడా ‘ఓం’ కావడం.. ఇవన్నీ చూస్తుంటే ఇదొక దైవిక సంకల్పంలా, అమ్మవారి ఆశీస్సుల్లా నాకు అనిపించింది. నన్ను కనీసం కలవకుండా, ఎలాంటి లుక్ టెస్ట్ కూడా చేయకుండా దర్శకుడు రాజ్‌కుమార్ గారు నాపై ఎంతో నమ్మకంతో ఈ పాత్రకు ఎంపిక చేశారు. ఈ వేడుకలో ఆయన లేకపోవడం కాస్త లోటుగా అనిపిస్తోంది. నాపై ఆయన పెట్టుకున్న నమ్మకానికి ప్రత్యేక ధన్యవాదాలు” అని రేణూ దేశాయ్ ఆనందం వ్యక్తం చేశారు.

తోటి నటీనటులతో తన వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్న రేణూ.. మలయాళ లెజెండ్ మమ్ముట్టిపై ప్రశంసల వర్షం కురిపించారు. “నాకు 45 ఏళ్లు వచ్చాయి, ఈ వయసులో జీవితంలో దాదాపు అన్నీ చూసేశానని అనుకున్నాను. కానీ మమ్ముట్టి సార్‌ను చూశాక, ఆయనతో కలిసి పనిచేసే వరకు అసలైన స్థాయి, గొప్పదనం ఏంటో నాకు తెలియలేదు. ఆయన అద్భుతమైన వ్యక్తిత్వం, నటనా నైపుణ్యం ముందు నిలబడి మాట్లాడటానికే నాకు చాలా భయమేసింది. ఆయన నటనను వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. ఆయన లెవెల్ వేరు, అలాంటి లెజెండరీ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. సెట్‌లో ఆయన నన్ను ఎంతో కంఫర్టబుల్‌గా, మర్యాదగా చూసుకున్నారు” అని వినమ్రంగా చెప్పారు.

ధనుష్‌కు స్పెషల్ థాంక్స్:

ఇతర నటీనటుల గురించి మాట్లాడుతూ.. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవితో కలిసి నటించే సన్నివేశాలు తనకు లేకపోవడం కొంత నిరాశ కలిగించినా, మరో హీరోయిన్ శ్రీలీలతో కలిసి చేసిన సీన్లు చాలా అద్భుతంగా వచ్చాయని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. ఇక హీరో ధనుష్ గురించి చెబుతూ.. “షూటింగ్ సమయంలో నాకు తమిళ భాష సరిగా రాకపోవడం వల్ల డైలాగ్స్ చెప్పడంలో ఎన్నో తప్పులు చేశాను. ఆ సమయంలో నా తప్పులను ఓపికగా భరించి, నాకు ఎంతో సహకరించిన ధనుష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను” అని అన్నారు.

చివరగా.. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు రేణూ దేశాయ్. ఈ నెల 23న భారీ స్థాయిలో థియేటర్లలోకి వస్తున్న ‘ఓం’ సినిమాను ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో చూసి ఆదరించాలని, అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో తాను చేసిన ఈ పాత్ర ఎలా ఉందో చూసి చెప్పాలని ఆమె ప్రేక్షకులను కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 10:32 am Digital Edition : Prabhanews
Renu Desai: ఆయన లెవెల్ వేరు, ఇదంతా దైవ సంకల్పం.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 17, 2026 10:27 AM ISTలేటెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'ఓం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటి రేణూ దేశాయ్ మాట్లాడిన తీరు, ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. News18కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, టాలెంటెడ్ హీరోయిన్లు సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'ఓం' (O.M). వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నటి రేణూ దేశాయ్ తన కుమార్తె ఆద్యతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాలా కాలం తర్వాత వెండితెరపై ఒక కీలక పాత్రలో కనిపించనున్న రేణూ దేశాయ్.. వేదికపై మాట్లాడుతూ తన సినిమా ప్రయాణాన్ని, షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.ఇది దైవిక సంకల్పం:ఈ సినిమాలో అవకాశం రావడం వెనుక ఉన్న ఒక ఆధ్యాత్మిక కోణాన్ని అభిమానులతో పంచుకున్నారు రేణూ దేశాయ్. "ఈ ఫిబ్రవరిలో మహాశివరాత్రి పర్వదినాన నేను అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్య అమ్మవారి దర్శనంలో ఉన్నాను. సరిగ్గా ఆ సమయంలోనే ఈ సినిమా కోసం నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఒకవైపు మహాశివరాత్రి పవిత్ర దినం, కామాఖ్య క్షేత్రంలో ఉండటం, దానికి తోడు సినిమా పేరు కూడా 'ఓం' కావడం.. ఇవన్నీ చూస్తుంటే ఇదొక దైవిక సంకల్పంలా, అమ్మవారి ఆశీస్సుల్లా నాకు అనిపించింది. నన్ను కనీసం కలవకుండా, ఎలాంటి లుక్ టెస్ట్ కూడా చేయకుండా దర్శకుడు రాజ్‌కుమార్ గారు నాపై ఎంతో నమ్మకంతో ఈ పాత్రకు ఎంపిక చేశారు. ఈ వేడుకలో ఆయన లేకపోవడం కాస్త లోటుగా అనిపిస్తోంది. నాపై ఆయన పెట్టుకున్న నమ్మకానికి ప్రత్యేక ధన్యవాదాలు" అని రేణూ దేశాయ్ ఆనందం వ్యక్తం చేశారు.తోటి నటీనటులతో తన వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్న రేణూ.. మలయాళ లెజెండ్ మమ్ముట్టిపై ప్రశంసల వర్షం కురిపించారు. "నాకు 45 ఏళ్లు వచ్చాయి, ఈ వయసులో జీవితంలో దాదాపు అన్నీ చూసేశానని అనుకున్నాను. కానీ మమ్ముట్టి సార్‌ను చూశాక, ఆయనతో కలిసి పనిచేసే వరకు అసలైన స్థాయి, గొప్పదనం ఏంటో నాకు తెలియలేదు. ఆయన అద్భుతమైన వ్యక్తిత్వం, నటనా నైపుణ్యం ముందు నిలబడి మాట్లాడటానికే నాకు చాలా భయమేసింది. ఆయన నటనను వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. ఆయన లెవెల్ వేరు, అలాంటి లెజెండరీ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. సెట్‌లో ఆయన నన్ను ఎంతో కంఫర్టబుల్‌గా, మర్యాదగా చూసుకున్నారు" అని వినమ్రంగా చెప్పారు.ధనుష్‌కు స్పెషల్ థాంక్స్:ఇతర నటీనటుల గురించి మాట్లాడుతూ.. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవితో కలిసి నటించే సన్నివేశాలు తనకు లేకపోవడం కొంత నిరాశ కలిగించినా, మరో హీరోయిన్ శ్రీలీలతో కలిసి చేసిన సీన్లు చాలా అద్భుతంగా వచ్చాయని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. ఇక హీరో ధనుష్ గురించి చెబుతూ.. "షూటింగ్ సమయంలో నాకు తమిళ భాష సరిగా రాకపోవడం వల్ల డైలాగ్స్ చెప్పడంలో ఎన్నో తప్పులు చేశాను. ఆ సమయంలో నా తప్పులను ఓపికగా భరించి, నాకు ఎంతో సహకరించిన ధనుష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను" అని అన్నారు.చివరగా.. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు రేణూ దేశాయ్. ఈ నెల 23న భారీ స్థాయిలో థియేటర్లలోకి వస్తున్న 'ఓం' సినిమాను ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో చూసి ఆదరించాలని, అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో తాను చేసిన ఈ పాత్ర ఎలా ఉందో చూసి చెప్పాలని ఆమె ప్రేక్షకులను కోరారు.మరింత చదవండి

Source link