Airtel Offers: ఎయిర్‌టెల్ సిమ్ ఉంటే చాలు.. రూ.30 వేల విలువైన బెనిఫిట్స్ పొందొచ్చు! | బిజినెస్


Last Updated:

మీరు ఎయిర్‌టెల్ సిమ్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు తెలియని ఎన్నో ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

Airtel Offers
Airtel Offers

మొబైల్ రీఛార్జ్, ఇంటర్నెట్ సేవలకే పరిమితం కాకుండా తమ వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు ఎయిర్‌టెల్ కొత్త అవకాశాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా ‘ఎయిర్‌టెల్ ఇన్‌సైడర్’ వేదిక ద్వారా వివిధ ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన ప్రత్యేక ఆఫర్లు, రాయితీలను అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఉన్న అన్ని ఆఫర్లను అర్హత మేరకు వినియోగించుకుంటే రూ.30 వేలకుపైగా విలువైన ప్రయోజనాలు పొందవచ్చని సంస్థ వెల్లడించింది. విద్య, షాపింగ్, వినోదం, ఆహారం, ఆరోగ్యం వంటి విభిన్న విభాగాల్లో ఈ ఆఫర్లు ఉన్నాయి.

డ్యుయోలింగో నుంచి క్రోమా వరకు ప్రత్యేక ఆఫర్లు

కొత్త భాష నేర్చుకోవాలనుకునే వారికి డ్యుయోలింగో సూపర్ సబ్‌స్క్రిప్షన్‌ను 12 నెలల పాటు ఉచితంగా పొందే అవకాశం ఉంది. దీని విలువ రూ.3,120గా పేర్కొన్నారు. గాడ్జెట్లు కొనుగోలు చేయాలనుకునే వారికి క్రోమా ద్వారా ఎంపిక చేసిన ఐఫోన్ మోడళ్లపై భారీగా ఆదా చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఐఫోన్ 15, 16, 17 సిరీస్‌లలోని నిర్దిష్ట మోడళ్లపై క్రోమా లేదా యాపిల్ ద్వారా రూ.23 వేల వరకు ప్రయోజనాలు లభించవచ్చని సంస్థ తెలిపింది. అయితే ఈ ఆఫర్ అన్ని ఐఫోన్ మోడళ్లకు వర్తించదు.

సినిమాలు, వినోదంపై కూడా రాయితీలు

వినోద ప్రియుల కోసం పాకెట్ ఎఫ్ఎం ప్రీమియం సభ్యత్వాన్ని మూడు నెలల పాటు అందిస్తున్నారు. సినిమాలు చూసేవారికి సినీపోలిస్‌లో రెండు టికెట్లు కొనుగోలు చేస్తే మరో టికెట్ ఉచితంగా పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్ ద్వారా గరిష్ఠంగా రూ.150 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తించే మరో ప్రయోజనం కూడా ఉంది. సినీపోలిస్‌లో ఆహారం, పానీయాల ఆర్డర్లపై రూ.1,500 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే రూ.300 తగ్గింపు లభిస్తుంది.

ఆరోగ్య సేవలకూ ప్రయోజనం

ఆరోగ్య సంరక్షణ కోసం అపోలో 24X7 అందించే అపోలో సర్కిల్ సభ్యత్వాన్ని ఆరు నెలల పాటు పొందవచ్చు. ఇలా విద్య నుంచి ఆరోగ్యం వరకు పలు అవసరాలకు ఒకే వేదికపై ఆఫర్లు అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం పేర్కొన్న అన్ని ప్రయోజనాలను కలిపి వినియోగిస్తే రూ.30 వేలకు పైగా విలువ ఉంటుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది.

ఎయిర్‌టెల్ యాప్‌లో ఎలా పొందాలి?

అర్హత కలిగిన ఎయిర్‌టెల్ మొబైల్, ఎయిర్‌టెల్ హోమ్ వినియోగదారులు తమ ఎయిర్‌టెల్ యాప్‌ను తెరిచి అందులోని ‘ఎయిర్‌టెల్ ఇన్‌సైడర్’ విభాగాన్ని సందర్శించాలి. అక్కడ అందుబాటులో ఉన్న ఆఫర్లను పరిశీలించి, నచ్చిన ప్రయోజనాన్ని ఎంచుకుని సంబంధిత నిబంధనల ప్రకారం పొందవచ్చు. గతంలో లింక్డ్‌ఇన్ ప్రీమియం, ఈజీడైనర్, మేక్‌మైట్రిప్ వంటి సంస్థలతోనూ ఎయిర్‌టెల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. భవిష్యత్తులో మరిన్ని బ్రాండ్లను, కొత్త ఆఫర్లను ఈ వేదికపైకి తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది. అయితే ప్రతి ఆఫర్‌కు ప్రత్యేక అర్హతలు, నిబంధనలు వర్తిస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 November 2026, 9:53 pm Digital Edition : Prabhanews
Airtel Offers: ఎయిర్‌టెల్ సిమ్ ఉంటే చాలు.. రూ.30 వేల విలువైన బెనిఫిట్స్ పొందొచ్చు! | బిజినెస్

Last Updated:Nov 16, 2026 9:37 PM ISTమీరు ఎయిర్‌టెల్ సిమ్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు తెలియని ఎన్నో ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. Airtel Offersమొబైల్ రీఛార్జ్, ఇంటర్నెట్ సేవలకే పరిమితం కాకుండా తమ వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు ఎయిర్‌టెల్ కొత్త అవకాశాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా ‘ఎయిర్‌టెల్ ఇన్‌సైడర్’ వేదిక ద్వారా వివిధ ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన ప్రత్యేక ఆఫర్లు, రాయితీలను అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఉన్న అన్ని ఆఫర్లను అర్హత మేరకు వినియోగించుకుంటే రూ.30 వేలకుపైగా విలువైన ప్రయోజనాలు పొందవచ్చని సంస్థ వెల్లడించింది. విద్య, షాపింగ్, వినోదం, ఆహారం, ఆరోగ్యం వంటి విభిన్న విభాగాల్లో ఈ ఆఫర్లు ఉన్నాయి.డ్యుయోలింగో నుంచి క్రోమా వరకు ప్రత్యేక ఆఫర్లుకొత్త భాష నేర్చుకోవాలనుకునే వారికి డ్యుయోలింగో సూపర్ సబ్‌స్క్రిప్షన్‌ను 12 నెలల పాటు ఉచితంగా పొందే అవకాశం ఉంది. దీని విలువ రూ.3,120గా పేర్కొన్నారు. గాడ్జెట్లు కొనుగోలు చేయాలనుకునే వారికి క్రోమా ద్వారా ఎంపిక చేసిన ఐఫోన్ మోడళ్లపై భారీగా ఆదా చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఐఫోన్ 15, 16, 17 సిరీస్‌లలోని నిర్దిష్ట మోడళ్లపై క్రోమా లేదా యాపిల్ ద్వారా రూ.23 వేల వరకు ప్రయోజనాలు లభించవచ్చని సంస్థ తెలిపింది. అయితే ఈ ఆఫర్ అన్ని ఐఫోన్ మోడళ్లకు వర్తించదు.సినిమాలు, వినోదంపై కూడా రాయితీలువినోద ప్రియుల కోసం పాకెట్ ఎఫ్ఎం ప్రీమియం సభ్యత్వాన్ని మూడు నెలల పాటు అందిస్తున్నారు. సినిమాలు చూసేవారికి సినీపోలిస్‌లో రెండు టికెట్లు కొనుగోలు చేస్తే మరో టికెట్ ఉచితంగా పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్ ద్వారా గరిష్ఠంగా రూ.150 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తించే మరో ప్రయోజనం కూడా ఉంది. సినీపోలిస్‌లో ఆహారం, పానీయాల ఆర్డర్లపై రూ.1,500 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే రూ.300 తగ్గింపు లభిస్తుంది.ఆరోగ్య సేవలకూ ప్రయోజనంఆరోగ్య సంరక్షణ కోసం అపోలో 24X7 అందించే అపోలో సర్కిల్ సభ్యత్వాన్ని ఆరు నెలల పాటు పొందవచ్చు. ఇలా విద్య నుంచి ఆరోగ్యం వరకు పలు అవసరాలకు ఒకే వేదికపై ఆఫర్లు అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం పేర్కొన్న అన్ని ప్రయోజనాలను కలిపి వినియోగిస్తే రూ.30 వేలకు పైగా విలువ ఉంటుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది.ఎయిర్‌టెల్ యాప్‌లో ఎలా పొందాలి?అర్హత కలిగిన ఎయిర్‌టెల్ మొబైల్, ఎయిర్‌టెల్ హోమ్ వినియోగదారులు తమ ఎయిర్‌టెల్ యాప్‌ను తెరిచి అందులోని ‘ఎయిర్‌టెల్ ఇన్‌సైడర్’ విభాగాన్ని సందర్శించాలి. అక్కడ అందుబాటులో ఉన్న ఆఫర్లను పరిశీలించి, నచ్చిన ప్రయోజనాన్ని ఎంచుకుని సంబంధిత నిబంధనల ప్రకారం పొందవచ్చు. గతంలో లింక్డ్‌ఇన్ ప్రీమియం, ఈజీడైనర్, మేక్‌మైట్రిప్ వంటి సంస్థలతోనూ ఎయిర్‌టెల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. భవిష్యత్తులో మరిన్ని బ్రాండ్లను, కొత్త ఆఫర్లను ఈ వేదికపైకి తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది. అయితే ప్రతి ఆఫర్‌కు ప్రత్యేక అర్హతలు, నిబంధనలు వర్తిస్తాయి.మరింత చదవండి

Source link