శ్రీకాకుళం రోడ్ – కొల్లాం ప్రత్యేక రైళ్లు: శ్రీకాకుళం రోడ్ నుంచి కొల్లాంకు వెళ్లే భక్తుల కోసం రైలు నంబర్ 08539ను ఏర్పాటు చేశారు. ఈ రైలు ప్రతి ఆదివారం ఉదయం 9:20 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరి, సోమవారం రాత్రి 9:30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. 2026 నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీలతో పాటు 2027 జనవరి 3, 10, 17, 24 తేదీల్లో ఈ రైలు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 08540 కొల్లాం నుంచి శ్రీకాకుళం రోడ్‌కు వెళ్తుంది. ప్రతి మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటలకు కొల్లాంలో బయలుదేరి, బుధవారం సాయంత్రం 4:50 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. ఈ రైలు 2026 నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29 తేదీలతో పాటు 2027 జనవరి 5, 12, 19, 26 తేదీల్లో నడుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

