ప్రభన్యూస్

Salman Khan Maatrubhumi: సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ ట్రైలర్ విడుదల.. గల్వాన్ వీరుడి పాత్రలో భాయ్‌జాన్..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా దేశభక్తి చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ట్రైలర్ విడుదలైంది. 2020 గల్వాన్ లోయ ఘర్షణల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదలవుతోంది.

News18
News18

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన భారీ వార్ డ్రామా చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది. ఇందులో సల్మాన్ 16 బీహార్ రెజిమెంట్‌కు చెందిన సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. దేశ రక్షణ కోసం సరిహద్దులో పోరాడే సైనికుడిగా, మరోవైపు భార్య, పిల్లలతో గడిపే బాధ్యతాయుతమైన కుటుంబ పెద్దగా రెండు పార్శ్వాల్లో ఆయన అద్భుత నటన కనబరిచారు. హీరోయిన్ చిత్రాంగదా సింగ్ ఈ సినిమాలో సల్మాన్ భార్య పాత్రను పోషించారు. డిసెంబర్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

గతంలో ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో జైన్ షా, అభిశ్రీ సేన్ కీలక పాత్రలు పోషించారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ పతాకంపై స్వయంగా సల్మాన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. హిమేశ్ రేషమియా, రవి బస్రూర్, అయాన్ లాల్ సంగీతాన్ని సమకూర్చగా, ఫసాహత్ ఖాన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పటికే విడుదలైన మాతృభూమి టైటిల్ ట్రాక్, మెయిన్ హూన్, చాంద్ దేఖ్ లూన్, జై హింద్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సల్మాన్ ఖాన్ ఇటీవల రితేష్ దేశ్‌ముఖ్ తెరకెక్కించిన ‘రాజా శివాజీ’లో జీవా మహాలా పాత్రలో, అలాగే సంజయ్ దత్‌తో కలిసి ‘7 డాగ్స్’ చిత్రంలో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. హీరోయిన్ చిత్రాంగదా సింగ్ ‘హౌస్‌ఫుల్ 5’, నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ ‘రాత్ అకేలీ హై: ది బన్సాల్ మర్డర్స్’తో అలరించారు. పూర్తి స్థాయి దేశభక్తి, యాక్షన్ అంశాలతో వస్తున్న ‘మాతృభూమి’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 November 2026, 10:46 pm Digital Edition : Prabhanews
Salman Khan Maatrubhumi: సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ ట్రైలర్ విడుదల.. గల్వాన్ వీరుడి పాత్రలో భాయ్‌జాన్..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 10, 2026 10:44 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా దేశభక్తి చిత్రం 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' ట్రైలర్ విడుదలైంది. 2020 గల్వాన్ లోయ ఘర్షణల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదలవుతోంది.News18బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన భారీ వార్ డ్రామా చిత్రం 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది. ఇందులో సల్మాన్ 16 బీహార్ రెజిమెంట్‌కు చెందిన సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. దేశ రక్షణ కోసం సరిహద్దులో పోరాడే సైనికుడిగా, మరోవైపు భార్య, పిల్లలతో గడిపే బాధ్యతాయుతమైన కుటుంబ పెద్దగా రెండు పార్శ్వాల్లో ఆయన అద్భుత నటన కనబరిచారు. హీరోయిన్ చిత్రాంగదా సింగ్ ఈ సినిమాలో సల్మాన్ భార్య పాత్రను పోషించారు. డిసెంబర్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.
Aaj release karoon ya kal ?
Jo kal kare so aaj kar, Jo aaj kare so ab.Enjoy the trailer…..
#MaatrubhumiTrailer out now
@IChitrangda @LakhiaApoorva #ZeynShaw #AbhishrriSen @JasonThamIndia @TheAnkurBhatia #HarshilShah #HeeraSohal #VipinBhardwaj @TanyaDesai4 #HimeshReshammiya @meetbros @SKFilmsOfficial @SKF_Music @RaviBasrur @cchintanshaah @ShamiraahN @editormayuresh— Salman Khan (@BeingSalmanKhan) November 10, 2026గతంలో 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' అనే టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో జైన్ షా, అభిశ్రీ సేన్ కీలక పాత్రలు పోషించారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ పతాకంపై స్వయంగా సల్మాన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. హిమేశ్ రేషమియా, రవి బస్రూర్, అయాన్ లాల్ సంగీతాన్ని సమకూర్చగా, ఫసాహత్ ఖాన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పటికే విడుదలైన మాతృభూమి టైటిల్ ట్రాక్, మెయిన్ హూన్, చాంద్ దేఖ్ లూన్, జై హింద్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.సల్మాన్ ఖాన్ ఇటీవల రితేష్ దేశ్‌ముఖ్ తెరకెక్కించిన 'రాజా శివాజీ'లో జీవా మహాలా పాత్రలో, అలాగే సంజయ్ దత్‌తో కలిసి '7 డాగ్స్' చిత్రంలో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. హీరోయిన్ చిత్రాంగదా సింగ్ 'హౌస్‌ఫుల్ 5', నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ 'రాత్ అకేలీ హై: ది బన్సాల్ మర్డర్స్'తో అలరించారు. పూర్తి స్థాయి దేశభక్తి, యాక్షన్ అంశాలతో వస్తున్న 'మాతృభూమి'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.మరింత చదవండి

Source link