ప్రభన్యూస్

Price Hike: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ ధరలు పెరిగాయ్.. కొత్త రేట్లు ఇవే! | బిజినెస్


Last Updated:

Price Hike: ఇప్పటికే కూరగాయలు, పప్పులు, వంట నూనెల ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఇంట్లో నిత్యం ఉపయోగించే సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ వంటి ప్రముఖ డిటర్జెంట్ ఉత్పత్తుల ధరలను HUL పెంచింది. ఒక్కోదానిపై ఎంత పెరిగిందంటే?

AI IMAGE
AI IMAGE

రోజువారీ నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు మరింత భారంగా మారుతున్నాయి. ఇప్పటికే కూరగాయలు, పప్పులు, వంట నూనెల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు మరో షాక్ తగిలింది. ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) కీలక నిర్ణయం తీసుకుంది. తన హోమ్ కేర్ ఉత్పత్తుల ధరలను పెంచింది. ముఖ్యంగా ఇళ్లలో నిత్యం ఉపయోగించే సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ వంటి ప్రముఖ డిటర్జెంట్ బ్రాండ్ల ధరలను గరిష్ఠంగా 11 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొన్ని ప్యాకెట్లపై ఏకంగా రూ.10 వరకు ధర పెరగడంతో నెలవారీ ఇంటి ఖర్చులు మరింత పెరగనున్నాయి.

కంపెనీ తాజా ధరల సవరణలో భాగంగా వివిధ ఉత్పత్తుల ప్యాకెట్ సైజులను బట్టి రూ.1 నుంచి రూ.10 వరకు పెంచింది. సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ ఒక కిలో ప్యాకెట్ ధర గతంలో రూ.235 ఉండగా, ఇప్పుడు రూ.245కు చేరింది. అంటే ఒక్క ప్యాకెట్‌పై రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 500 గ్రాముల ప్యాకెట్ ధర కూడా రూ.123 నుంచి రూ.125కు పెరిగింది. అలాగే సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ ఒక కిలో ప్యాకెట్ ధర రూ.167 నుంచి రూ.172కు చేరింది. 500 గ్రాముల ప్యాకెట్ ధర రూ.85 నుంచి రూ.87కు పెరిగింది. సర్ఫ్ ఎక్సెల్ బార్ 250 గ్రాముల ధర రూ.42 నుంచి రూ.45కు చేరింది. నాలుగు బార్ల ప్యాక్ ధర కూడా రూ.145 నుంచి రూ.155కు పెరిగింది. దీంతో ఈ బ్రాండ్‌ను క్రమం తప్పకుండా కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

రిన్, వీల్ ధరలు కూడా పెరిగాయ్..

సర్ఫ్ ఎక్సెల్‌తో పాటు రిన్ ఉత్పత్తుల ధరలను కూడా HUL సవరించింది. రిన్ అలా 500 మిల్లీలీటర్ల ప్యాక్ ధర రూ.90 నుంచి రూ.95కు పెరిగింది. రిన్ డిటర్జెంట్ పౌడర్ ఒక కిలో ప్యాకెట్ ధర రూ.120 నుంచి రూ.123కు చేరగా, 500 గ్రాముల ప్యాకెట్ ధర రూ.61 నుంచి రూ.63కు పెరిగింది. మరోవైపు వీల్ డిటర్జెంట్ పౌడర్ ధర కూడా పెరిగింది. 500 గ్రాముల ప్యాకెట్ గతంలో రూ.46 ఉండగా, ఇప్పుడు రూ.47కు చేరింది. కేవలం డిటర్జెంట్లకే పరిమితం కాకుండా మోతీ గులాబ్ సబ్బు ధరను కూడా కంపెనీ పెంచింది. 150 గ్రాముల సబ్బు ధర రూ.74 నుంచి రూ.82కు చేరింది. అంటే ఒక్క సబ్బుపై రూ.8 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ధరలు ఎందుకు పెంచుతున్నారు?

ముడిసరుకుల ధరలు, ఇతర ఉత్పత్తి ఖర్చులు పెరుగుతుండటంతో కంపెనీలు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఉత్పత్తి వ్యయాలు పెరిగిన నేపథ్యంలో లాభాల మార్జిన్లను కాపాడుకోవడానికి HUL ధరలను సవరించింది. గత నెలలో కంపెనీ ఎండీ, సీఈఓ ప్రియా నాయర్ కూడా ముడిసరుకుల ధరల్లో మార్పులకు అనుగుణంగా అవసరమైన మేరకు ధరల పెంపు ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్న సామాన్య కుటుంబాలకు ఈ ధరల పెంపు మరో భారంగా మారనుంది. ముఖ్యంగా నెలకు ఒకటి కంటే ఎక్కువ డిటర్జెంట్ ప్యాకెట్లు కొనుగోలు చేసే కుటుంబాలపై ఈ ప్రభావం కనిపించనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 November 2026, 8:26 am Digital Edition : Prabhanews
Price Hike: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ ధరలు పెరిగాయ్.. కొత్త రేట్లు ఇవే! | బిజినెస్

Last Updated:Nov 10, 2026 8:03 AM ISTPrice Hike: ఇప్పటికే కూరగాయలు, పప్పులు, వంట నూనెల ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఇంట్లో నిత్యం ఉపయోగించే సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ వంటి ప్రముఖ డిటర్జెంట్ ఉత్పత్తుల ధరలను HUL పెంచింది. ఒక్కోదానిపై ఎంత పెరిగిందంటే?
AI IMAGEరోజువారీ నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు మరింత భారంగా మారుతున్నాయి. ఇప్పటికే కూరగాయలు, పప్పులు, వంట నూనెల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు మరో షాక్ తగిలింది. ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) కీలక నిర్ణయం తీసుకుంది. తన హోమ్ కేర్ ఉత్పత్తుల ధరలను పెంచింది. ముఖ్యంగా ఇళ్లలో నిత్యం ఉపయోగించే సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ వంటి ప్రముఖ డిటర్జెంట్ బ్రాండ్ల ధరలను గరిష్ఠంగా 11 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొన్ని ప్యాకెట్లపై ఏకంగా రూ.10 వరకు ధర పెరగడంతో నెలవారీ ఇంటి ఖర్చులు మరింత పెరగనున్నాయి.కంపెనీ తాజా ధరల సవరణలో భాగంగా వివిధ ఉత్పత్తుల ప్యాకెట్ సైజులను బట్టి రూ.1 నుంచి రూ.10 వరకు పెంచింది. సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ ఒక కిలో ప్యాకెట్ ధర గతంలో రూ.235 ఉండగా, ఇప్పుడు రూ.245కు చేరింది. అంటే ఒక్క ప్యాకెట్‌పై రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 500 గ్రాముల ప్యాకెట్ ధర కూడా రూ.123 నుంచి రూ.125కు పెరిగింది. అలాగే సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ ఒక కిలో ప్యాకెట్ ధర రూ.167 నుంచి రూ.172కు చేరింది. 500 గ్రాముల ప్యాకెట్ ధర రూ.85 నుంచి రూ.87కు పెరిగింది. సర్ఫ్ ఎక్సెల్ బార్ 250 గ్రాముల ధర రూ.42 నుంచి రూ.45కు చేరింది. నాలుగు బార్ల ప్యాక్ ధర కూడా రూ.145 నుంచి రూ.155కు పెరిగింది. దీంతో ఈ బ్రాండ్‌ను క్రమం తప్పకుండా కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడనుంది.రిన్, వీల్ ధరలు కూడా పెరిగాయ్..సర్ఫ్ ఎక్సెల్‌తో పాటు రిన్ ఉత్పత్తుల ధరలను కూడా HUL సవరించింది. రిన్ అలా 500 మిల్లీలీటర్ల ప్యాక్ ధర రూ.90 నుంచి రూ.95కు పెరిగింది. రిన్ డిటర్జెంట్ పౌడర్ ఒక కిలో ప్యాకెట్ ధర రూ.120 నుంచి రూ.123కు చేరగా, 500 గ్రాముల ప్యాకెట్ ధర రూ.61 నుంచి రూ.63కు పెరిగింది. మరోవైపు వీల్ డిటర్జెంట్ పౌడర్ ధర కూడా పెరిగింది. 500 గ్రాముల ప్యాకెట్ గతంలో రూ.46 ఉండగా, ఇప్పుడు రూ.47కు చేరింది. కేవలం డిటర్జెంట్లకే పరిమితం కాకుండా మోతీ గులాబ్ సబ్బు ధరను కూడా కంపెనీ పెంచింది. 150 గ్రాముల సబ్బు ధర రూ.74 నుంచి రూ.82కు చేరింది. అంటే ఒక్క సబ్బుపై రూ.8 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.ధరలు ఎందుకు పెంచుతున్నారు?ముడిసరుకుల ధరలు, ఇతర ఉత్పత్తి ఖర్చులు పెరుగుతుండటంతో కంపెనీలు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఉత్పత్తి వ్యయాలు పెరిగిన నేపథ్యంలో లాభాల మార్జిన్లను కాపాడుకోవడానికి HUL ధరలను సవరించింది. గత నెలలో కంపెనీ ఎండీ, సీఈఓ ప్రియా నాయర్ కూడా ముడిసరుకుల ధరల్లో మార్పులకు అనుగుణంగా అవసరమైన మేరకు ధరల పెంపు ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్న సామాన్య కుటుంబాలకు ఈ ధరల పెంపు మరో భారంగా మారనుంది. ముఖ్యంగా నెలకు ఒకటి కంటే ఎక్కువ డిటర్జెంట్ ప్యాకెట్లు కొనుగోలు చేసే కుటుంబాలపై ఈ ప్రభావం కనిపించనుంది.మరింత చదవండి

Source link