Last Updated:
దసరా పండక్కు మూడు రోజుల ముందు రిలీజై యునానిమస్‌గా హిట్టు టాక్ తెచ్చుకున్న సినిమా గరివిడి లక్ష్మీ. ఆనంది హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఉత్తరాంధ్ర జానపద కళారూపమైన బుర్రకథకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకచ్చిన దిగ్గజ కళాకారిని రెడ్డి విజయలక్ష్మీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
దసరా పండక్కు మూడు రోజుల ముందు రిలీజై యునానిమస్‌గా హిట్టు టాక్ తెచ్చుకున్న సినిమా గరివిడి లక్ష్మీ. ఆనంది హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఉత్తరాంధ్ర జానపద కళారూపమైన బుర్రకథకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకచ్చిన దిగ్గజ కళాకారిని రెడ్డి విజయలక్ష్మీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించాడు. రిలీజ్‌కు ముందు నుంచి ఈ సినిమాపై పాజిటీవ్ హైప్ క్రియేట్ అయింది.
ఇక రిలీజ్ తర్వాత సినిమా చాలా మందికి బాగా నచ్చింది. అయితే కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. పోటీగా జైలర్2, రణబాలి వంటి కమర్షియల్ సినిమాలు ఉండటంతో గరివిడి లక్ష్మీపై కలెక్షన్ల ప్రభావం పడింది. అయితే.. సినిమా చూసిన వాళ్లు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాడ్ రివ్యూ ఇవ్వలేకపోయారంటే ఏ రేంజ్లో సినిమా ఇంపాక్ట్ చూపించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ముఖ్యంగా కథలోని భావోద్వేగాలు, ఆనంది నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో ఆనంది టైటిల్ రోల్లో అద్భుతంగా నటించి మెప్పించింది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆమె తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ రాశి తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వీరితో పాటు వీకే నరేశ్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశాలిని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా కోసం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘గరివిడి లక్ష్మి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నవంబర్ 13, శుక్రవారం నుంచే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు రానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆనంది సినిమాను ఇంట్లోనే చూడాలని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
అయితే ఈ ఓటీటీ విడుదల తేదీపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న సమాచారం కేవలం రూమర్ మాత్రమే. అమెజాన్ ప్రైమ్ వీడియో లేదా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన తర్వాతే స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత రానుంది.
ఇక ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించారు.
సినిమా కథ విషయానికి వస్తే.. 1990ల కాలంలో సుమారు 15 ఏళ్ల వ్యవధిలోనే 10 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్న బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆమె జీవితంలో ఎదురైన కష్టాలు, సవాళ్లు, కళాకారిణిగా నిలదొక్కుకునేందుకు చేసిన పోరాటాన్ని దర్శకుడు భావోద్వేగంగా చూపించారు.
ముఖ్యంగా 1977 నాటి ఉత్తరాంధ్ర పల్లెటూరి వాతావరణం, అక్కడి యాస, భాష, జీవనశైలిని సహజంగా తెరపై ఆవిష్కరించారు. అప్పటి రంగస్థల మహిళా కళాకారులు ఎదుర్కొన్న అవమానాలు, వివక్షను కూడా కథలో భాగంగా చూపించారు. మొత్తానికి ఓ మంచి విజయాన్ని అందుకున్న ‘గరివిడి లక్ష్మి’ ఓటీటీ విడుదలపై వస్తున్న వార్తలు నిజమవుతాయా? అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

