ప్రభన్యూస్

Gold Sales: ధరలు తగ్గితే ఇండియన్స్ ఆగుతారా? ఎగబడి మరీ బంగారం కొనేస్తున్నారు! | బిజినెస్


Last Updated:

Gold Sales: బంగారం కొనాలని ఎదురుచూస్తున్నవారికి ధన్‌తేరాస్ వేళ మంచి అవకాశం వచ్చింది. గత 10 రోజులుగా పసిడి ధరలు వరుసగా తగ్గుతుండటంతో కొనుగోలుదారులు నగల దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఈసారి ధన్‌తేరాస్ సందర్భంగా గతేడాదితో పోలిస్తే బంగారం అమ్మకాలు 10 శాతం పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

News18
News18

బంగారం కొనాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నవారికి ఇప్పుడు బంగారంలాంటి అవకాశం వచ్చింది. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. గత 10 రోజులుగా వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ధరలు ఎప్పుడు దిగివస్తాయా అని ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు ఇప్పుడు షాపుల బాట పట్టారు. మరికొందరు ప్రత్యేక రోజులు, పండుగల వేళ బంగారం కొనడం ఆనవాయితీగా పెట్టుకుంటారు. అలాంటి వారందరికీ ఈసారి ధన్‌తేరాస్ కలిసొచ్చింది. ఒకవైపు పండుగ సెంటిమెంట్.. మరోవైపు ఏడు నెలల కనిష్టానికి చేరిన బంగారం ధరలు కారణంగా నగల దుకాణాల్లో కొనుగోలుదారుల సందడి పెరిగింది. ఈసారి ధన్‌తేరాస్ సందర్భంగా గతేడాదితో పోలిస్తే బంగారం అమ్మకాలు దాదాపు 10 శాతం పెరిగే అవకాశం ఉందని ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది.

ఈ వారం ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,863కు పడిపోయింది. మార్చి 24 తర్వాత నమోదైన కనిష్ట స్థాయి ఇదే. శుక్రవారం నాటికి ధర కొంత కోలుకుని రూ.1,41,800 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,80,779కు చేరింది. ఆ రికార్డు స్థాయితో పోలిస్తే ప్రస్తుతం ధరలు భారీగా తగ్గాయి. దీంతో ఇన్నాళ్లూ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నవారు ఇప్పుడు కొనడానికి ఎగబడుతున్నారు.

ధర తగ్గడంతో షోరూమ్‌లకు క్యూ..

ధరలు తగ్గడం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు ఇప్పుడు ఆభరణాల షోరూమ్‌లకు వస్తున్నారని ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు. ధన్‌తేరాస్ రోజున ధరలు తగ్గడం కొనుగోళ్లకు కలిసొచ్చిందని చెప్పారు. ఈసారి పండుగ అమ్మకాలు గతేడాది కంటే దాదాపు 10 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఏం కొంటున్నారో తెలుసా?

ధన్‌తేరాస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం భారతీయులకు శుభప్రదంగా భావించే సంప్రదాయం. అందుకే ఈ రోజున ఆభరణాలతో పాటు బంగారు నాణేలు, బిస్కెట్లు కొనేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. గతేడాది నుంచి బంగారం మంచి రాబడిని ఇవ్వడంతో చాలామంది పెట్టుబడి కోణంలోనూ పసిడి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి కూడా రిటైల్ కొనుగోలుదారులు నాణేలు, బార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారని కోల్‌కతాకు చెందిన వ్యాపారి హర్షద్ అజ్మీరా తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం బంగారం డిమాండ్ సాధారణం కంటే తక్కువగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే దాదాపు 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో పంటల దిగుబడి, రైతుల ఆదాయంపై ప్రభావం పడింది. రైతుల కొనుగోలు శక్తి తగ్గడంతో గ్రామీణ ప్రాంతాల్లో బంగారం కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవని పూణేకు చెందిన పీఎన్ గాడ్గిల్ అండ్ సన్స్ సీఈఓ అమిత్ మోదక్ తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 8:55 pm Digital Edition : Prabhanews
Gold Sales: ధరలు తగ్గితే ఇండియన్స్ ఆగుతారా? ఎగబడి మరీ బంగారం కొనేస్తున్నారు! | బిజినెస్

Last Updated:Nov 06, 2026 8:53 PM ISTGold Sales: బంగారం కొనాలని ఎదురుచూస్తున్నవారికి ధన్‌తేరాస్ వేళ మంచి అవకాశం వచ్చింది. గత 10 రోజులుగా పసిడి ధరలు వరుసగా తగ్గుతుండటంతో కొనుగోలుదారులు నగల దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఈసారి ధన్‌తేరాస్ సందర్భంగా గతేడాదితో పోలిస్తే బంగారం అమ్మకాలు 10 శాతం పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
News18బంగారం కొనాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నవారికి ఇప్పుడు బంగారంలాంటి అవకాశం వచ్చింది. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. గత 10 రోజులుగా వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ధరలు ఎప్పుడు దిగివస్తాయా అని ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు ఇప్పుడు షాపుల బాట పట్టారు. మరికొందరు ప్రత్యేక రోజులు, పండుగల వేళ బంగారం కొనడం ఆనవాయితీగా పెట్టుకుంటారు. అలాంటి వారందరికీ ఈసారి ధన్‌తేరాస్ కలిసొచ్చింది. ఒకవైపు పండుగ సెంటిమెంట్.. మరోవైపు ఏడు నెలల కనిష్టానికి చేరిన బంగారం ధరలు కారణంగా నగల దుకాణాల్లో కొనుగోలుదారుల సందడి పెరిగింది. ఈసారి ధన్‌తేరాస్ సందర్భంగా గతేడాదితో పోలిస్తే బంగారం అమ్మకాలు దాదాపు 10 శాతం పెరిగే అవకాశం ఉందని ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది.ఈ వారం ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,863కు పడిపోయింది. మార్చి 24 తర్వాత నమోదైన కనిష్ట స్థాయి ఇదే. శుక్రవారం నాటికి ధర కొంత కోలుకుని రూ.1,41,800 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,80,779కు చేరింది. ఆ రికార్డు స్థాయితో పోలిస్తే ప్రస్తుతం ధరలు భారీగా తగ్గాయి. దీంతో ఇన్నాళ్లూ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నవారు ఇప్పుడు కొనడానికి ఎగబడుతున్నారు.ధర తగ్గడంతో షోరూమ్‌లకు క్యూ..ధరలు తగ్గడం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు ఇప్పుడు ఆభరణాల షోరూమ్‌లకు వస్తున్నారని ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు. ధన్‌తేరాస్ రోజున ధరలు తగ్గడం కొనుగోళ్లకు కలిసొచ్చిందని చెప్పారు. ఈసారి పండుగ అమ్మకాలు గతేడాది కంటే దాదాపు 10 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.ఏం కొంటున్నారో తెలుసా?ధన్‌తేరాస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం భారతీయులకు శుభప్రదంగా భావించే సంప్రదాయం. అందుకే ఈ రోజున ఆభరణాలతో పాటు బంగారు నాణేలు, బిస్కెట్లు కొనేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. గతేడాది నుంచి బంగారం మంచి రాబడిని ఇవ్వడంతో చాలామంది పెట్టుబడి కోణంలోనూ పసిడి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి కూడా రిటైల్ కొనుగోలుదారులు నాణేలు, బార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారని కోల్‌కతాకు చెందిన వ్యాపారి హర్షద్ అజ్మీరా తెలిపారు.పట్టణ ప్రాంతాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం బంగారం డిమాండ్ సాధారణం కంటే తక్కువగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే దాదాపు 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో పంటల దిగుబడి, రైతుల ఆదాయంపై ప్రభావం పడింది. రైతుల కొనుగోలు శక్తి తగ్గడంతో గ్రామీణ ప్రాంతాల్లో బంగారం కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవని పూణేకు చెందిన పీఎన్ గాడ్గిల్ అండ్ సన్స్ సీఈఓ అమిత్ మోదక్ తెలిపారు.మరింత చదవండి

Source link