ప్రభన్యూస్

Rice Price: బియ్యం ధరలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్.. ఇక మార్కెట్‌లోకి కుప్పలు కుప్పలుగా బియ్యం! | బిజినెస్


Last Updated:

Rice Price Hike: నెలకు సరిపడా బియ్యం కొనాలన్నా ఇప్పుడు సామాన్యులు జేబులో ఎక్కువ డబ్బు పెట్టుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు 25 కిలోల బియ్యం బ్యాగ్ రూ.1,500లోపే వచ్చేది.. ఇప్పుడు దాని ధర రూ.2,000 దాటుతోంది. వరి దిగుబడి తగ్గితే ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉండటంతో కేంద్రం అలర్ట్ అయింది. బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

News18
News18

ఒకప్పుడు చేతిలో రూ.1,200 నుంచి రూ.1,500 ఉంటే చాలు.. సూపర్ మార్కెట్‌కు వెళ్లి 25 కిలోల బియ్యం బ్యాగ్ కొనుక్కొని ఇంటికి వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అదే 25 కిలోల బియ్యం బ్యాగ్ కొనాలంటే రూ.2,000కు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. గతంలో కిలో రూ.50 ఉన్న బియ్యం ధరలు ఇప్పుడు రూ.80 నుంచి రూ.100కు చేరువవుతున్నాయి. దీంతో మధ్యతరగతి, సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే పప్పులు, నూనెలు, ఇతర నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు బియ్యం ధరల పెరుగుదల మరో భారంగా మారింది. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి వరి సాగు, దిగుబడిపై ప్రభావం పడవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే రానున్న రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మార్కెట్‌లో బియ్యం సరఫరాను పెంచి ధరలను అదుపు చేయడమే లక్ష్యంగా బహిరంగ మార్కెట్ విక్రయ పథకం (OMSS) కింద ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించే బియ్యం పరిమాణాన్ని కేంద్రం రెట్టింపు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ద్వారా 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విక్రయించాలని నిర్ణయించింది. గతంలో ఉన్న లక్ష్యాన్ని పెంచుతూ శుక్రవారం ప్రకటన చేసింది. మార్కెట్‌లో బియ్యం కొరత ఏర్పడకుండా చూడటంతో పాటు ధరలు మరింత పెరగకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ఏడాది దేశంలో వరి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాయిటర్స్‌కు వారు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారిగా భారత్‌లో వరి ఉత్పత్తి తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో దిగుబడి పడిపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వరి పంట కీలక దశలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తి, ఎగుమతి దేశంగా భారత్ ఉంది. అయితే ఈ ఏడాది రుతుపవనాల సమయంలో ఇప్పటివరకు సాధారణం కంటే దాదాపు 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు నివేదిక పేర్కొంది. వర్షాలు తగ్గితే వరి సాగు విస్తీర్ణం, పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఉత్పత్తి తగ్గి మార్కెట్‌లో సరఫరా పడిపోతే బియ్యం ధరలు మరింత పెరగవచ్చు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ముందస్తు చర్యలకు దిగింది.

ఇవి కూడా చదవండి: టీవీ కొనండి… రూ.15,000 క్యాష్‌బ్యాక్ పొందండి… ఏసీ, వాషింగ్ మెషీన్ గెలుచుకునే ఛాన్స్ కూడా!

బహిరంగ మార్కెట్ విక్రయ పథకం కింద ప్రభుత్వం ఇప్పటికే 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రైవేట్ కొనుగోలుదారులకు విక్రయించింది. గత ఏడాది ఇదే పథకం ద్వారా కేవలం 11 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అమ్మింది. ఈసారి విక్రయాల పరిమాణం గణనీయంగా పెరిగింది. తాజాగా లక్ష్యాన్ని 50 లక్షల టన్నులకు పెంచడంతో మార్కెట్‌లోకి మరింత బియ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ధరలు తగ్గుతాయా?

మార్కెట్‌లో బియ్యం నిల్వలు సరిపడా ఉండేలా చూడటంతో పాటు వ్యాపారులు అవసరానికి మించి నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించకుండా అడ్డుకోవాలని కేంద్రం భావిస్తోంది. అధిక ధరలకు విక్రయించే అవకాశాలను తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు కూడా 2027 జనవరి 31 వరకు వరి సరఫరాకు సంబంధించి అనుమతులు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాలతో మార్కెట్‌లో బియ్యం సరఫరా పెరిగి ధరలు కొంతవరకు తగ్గుతాయని కేంద్రం ఆశిస్తోంది. అయితే ఈ చర్యల ప్రభావం సామాన్యులపై ఎంతవరకు ఉంటుందో, 25 కిలోల బియ్యం బ్యాగ్ ధరలు మళ్లీ అందుబాటులోకి వస్తాయో లేదో రానున్న రోజుల్లో తేలనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 8:21 pm Digital Edition : Prabhanews
Rice Price: బియ్యం ధరలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్.. ఇక మార్కెట్‌లోకి కుప్పలు కుప్పలుగా బియ్యం! | బిజినెస్

Last Updated:Nov 06, 2026 8:14 PM ISTRice Price Hike: నెలకు సరిపడా బియ్యం కొనాలన్నా ఇప్పుడు సామాన్యులు జేబులో ఎక్కువ డబ్బు పెట్టుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు 25 కిలోల బియ్యం బ్యాగ్ రూ.1,500లోపే వచ్చేది.. ఇప్పుడు దాని ధర రూ.2,000 దాటుతోంది. వరి దిగుబడి తగ్గితే ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉండటంతో కేంద్రం అలర్ట్ అయింది. బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
News18ఒకప్పుడు చేతిలో రూ.1,200 నుంచి రూ.1,500 ఉంటే చాలు.. సూపర్ మార్కెట్‌కు వెళ్లి 25 కిలోల బియ్యం బ్యాగ్ కొనుక్కొని ఇంటికి వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అదే 25 కిలోల బియ్యం బ్యాగ్ కొనాలంటే రూ.2,000కు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. గతంలో కిలో రూ.50 ఉన్న బియ్యం ధరలు ఇప్పుడు రూ.80 నుంచి రూ.100కు చేరువవుతున్నాయి. దీంతో మధ్యతరగతి, సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే పప్పులు, నూనెలు, ఇతర నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు బియ్యం ధరల పెరుగుదల మరో భారంగా మారింది. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి వరి సాగు, దిగుబడిపై ప్రభావం పడవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే రానున్న రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.మార్కెట్‌లో బియ్యం సరఫరాను పెంచి ధరలను అదుపు చేయడమే లక్ష్యంగా బహిరంగ మార్కెట్ విక్రయ పథకం (OMSS) కింద ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించే బియ్యం పరిమాణాన్ని కేంద్రం రెట్టింపు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ద్వారా 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విక్రయించాలని నిర్ణయించింది. గతంలో ఉన్న లక్ష్యాన్ని పెంచుతూ శుక్రవారం ప్రకటన చేసింది. మార్కెట్‌లో బియ్యం కొరత ఏర్పడకుండా చూడటంతో పాటు ధరలు మరింత పెరగకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ ఏడాది దేశంలో వరి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాయిటర్స్‌కు వారు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారిగా భారత్‌లో వరి ఉత్పత్తి తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో దిగుబడి పడిపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వరి పంట కీలక దశలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తి, ఎగుమతి దేశంగా భారత్ ఉంది. అయితే ఈ ఏడాది రుతుపవనాల సమయంలో ఇప్పటివరకు సాధారణం కంటే దాదాపు 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు నివేదిక పేర్కొంది. వర్షాలు తగ్గితే వరి సాగు విస్తీర్ణం, పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఉత్పత్తి తగ్గి మార్కెట్‌లో సరఫరా పడిపోతే బియ్యం ధరలు మరింత పెరగవచ్చు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ముందస్తు చర్యలకు దిగింది.ఇవి కూడా చదవండి: టీవీ కొనండి... రూ.15,000 క్యాష్‌బ్యాక్ పొందండి... ఏసీ, వాషింగ్ మెషీన్ గెలుచుకునే ఛాన్స్ కూడా!బహిరంగ మార్కెట్ విక్రయ పథకం కింద ప్రభుత్వం ఇప్పటికే 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రైవేట్ కొనుగోలుదారులకు విక్రయించింది. గత ఏడాది ఇదే పథకం ద్వారా కేవలం 11 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అమ్మింది. ఈసారి విక్రయాల పరిమాణం గణనీయంగా పెరిగింది. తాజాగా లక్ష్యాన్ని 50 లక్షల టన్నులకు పెంచడంతో మార్కెట్‌లోకి మరింత బియ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ధరలు తగ్గుతాయా?మార్కెట్‌లో బియ్యం నిల్వలు సరిపడా ఉండేలా చూడటంతో పాటు వ్యాపారులు అవసరానికి మించి నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించకుండా అడ్డుకోవాలని కేంద్రం భావిస్తోంది. అధిక ధరలకు విక్రయించే అవకాశాలను తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు కూడా 2027 జనవరి 31 వరకు వరి సరఫరాకు సంబంధించి అనుమతులు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాలతో మార్కెట్‌లో బియ్యం సరఫరా పెరిగి ధరలు కొంతవరకు తగ్గుతాయని కేంద్రం ఆశిస్తోంది. అయితే ఈ చర్యల ప్రభావం సామాన్యులపై ఎంతవరకు ఉంటుందో, 25 కిలోల బియ్యం బ్యాగ్ ధరలు మళ్లీ అందుబాటులోకి వస్తాయో లేదో రానున్న రోజుల్లో తేలనుంది.మరింత చదవండి

Source link