ప్రభన్యూస్

Murder: బెంగళూరులో నరమేధం.. భార్య సహా ఏడుగురిని చంపిన క్యాబ్ డ్రైవర్! |


Last Updated:

Murder: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఊహకందని తీవ్ర నరమేధం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలు, కక్షలతో రగిలిపోయిన ఓ క్యాబ్ డ్రైవర్ అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తన భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని వరుసగా హతమార్చిన దారుణ ఉదంతం సిలికాన్ సిటీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. రోజుకో వ్యూహంతో ఒక్కొక్కరిని ఇంటికి పిలిపించి, రోకలిబండతో మోది ప్రాణాలు తీసిన తీరు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక రాజాజీనగర్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘాతుకానికి సంబంధించి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

20 ఏళ్ల కాపురం.. నిత్యం కలహాలు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగళూరు నగరంలో నివాసముంటున్న ఇందు శేఖర్ (45) వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతడికి సుమారు 20 సంవత్సరాల క్రితం సునీత అనే మహిళతో వివాహం జరిగింది. అయితే వీరి దాంపత్య జీవితంలో గత కొన్నేళ్లుగా తీవ్ర మనస్పర్థలు, గొడవలు చోటుచేసుకుంటున్నాయి. తమ కాపురంలో భార్య తరఫు బంధువులు మితిమీరి జోక్యం చేసుకుంటున్నారని, వారి వల్లే తమ మధ్య దూరం పెరుగుతోందని శేఖర్ తీవ్ర అసంతృప్తి, ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ తీవ్ర వాగ్వాదాలు జరిగేవి. తన సంసారంలో అత్తగారింటి వారి జోక్యం పెరిగిపోతోందన్న కక్షతో రగిలిపోయిన శేఖర్, వారిని అంతం చేయాలని పక్కా వ్యూహం రచించాడు.

ఒక్కొక్కరిని ఇంటికి పిలిపించి.. రోకలితో నరమేధంఅక్టోబర్ 17వ తేదీ నుంచి నిందితుడు ఇందు శేఖర్ తన రక్తదాహాన్ని అమలు చేయడం ప్రారంభించాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ముందుగా పథకం ప్రకారం తన ఇంట్లోనే భార్య సునీతపై రోకలిబండతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు, ఒక్కొక్కరిని వివిధ కారణాలు చెప్పి, మాట్లాడుకుందామని ఇంటికి రప్పించాడు.

ఇంటికి వచ్చిన భార్య తరఫు బంధువులను ఊహించని విధంగా రోకలిబండతో తలపై బలంగా కొట్టి వరుసగా హతమార్చాడు. ఈ క్రమంలో భార్య సునీత, అత్తతో పాటు కుటుంబానికి చెందిన ఏడుగురిని అతడు అతి కిరాతకంగా ప్రాణాలు తీశాడు. నగర శివార్లలో మృతదేహాల తరలింపుహత్యలు చేసిన అనంతరం ఆ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు శేఖర్ సినిమా ఫక్కీలో వ్యవహరించాడు. మృతదేహాలను ఒక్కొక్కటిగా తన క్యాబ్‌లోనే ఎక్కించుకుని బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో, శివారు ప్రదేశాల్లో పడేశాడు. కొన్ని రోజుల పాటు వరుసగా కుటుంబ సభ్యులెవరూ ఫోన్లు ఎత్తకపోవడం, బంధువుల జాడ తెలియకపోవడంతో మిగిలిన బంధువుల్లో తీవ్ర అనుమానాలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో అదృశ్యమైన వారి సమాచారంతో రంగంలోకి దిగిన రాజాజీనగర్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. అనుమానితుడిగా మారిన క్యాబ్ డ్రైవర్ ఇందు శేఖర్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో ఈ భయంకర నరమేధం గుట్టు రట్టయింది. తాను చేసిన హత్యల వివరాలను, మృతదేహాలను ఎక్కడెక్కడ విసిరేశాడో పోలీసులకు వివరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాల గుర్తింపు, స్వాధీన ప్రక్రియను వేగవంతం చేశారు. కేవలం కుటుంబంలో జోక్యం చేసుకుంటున్నారన్న కోపంతో ఏకంగా ఏడుగురి ప్రాణాలు తీసిన ఈ ఘటన బెంగళూరులో తీవ్ర సంచలనం రేపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 10:27 am Digital Edition : Prabhanews
Murder: బెంగళూరులో నరమేధం.. భార్య సహా ఏడుగురిని చంపిన క్యాబ్ డ్రైవర్! |

Last Updated:Nov 06, 2026 10:20 AM ISTMurder: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఊహకందని తీవ్ర నరమేధం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలు, కక్షలతో రగిలిపోయిన ఓ క్యాబ్ డ్రైవర్ అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు.ప్రతీకాత్మక చిత్రంతన భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని వరుసగా హతమార్చిన దారుణ ఉదంతం సిలికాన్ సిటీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. రోజుకో వ్యూహంతో ఒక్కొక్కరిని ఇంటికి పిలిపించి, రోకలిబండతో మోది ప్రాణాలు తీసిన తీరు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక రాజాజీనగర్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘాతుకానికి సంబంధించి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.20 ఏళ్ల కాపురం.. నిత్యం కలహాలుపోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగళూరు నగరంలో నివాసముంటున్న ఇందు శేఖర్ (45) వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతడికి సుమారు 20 సంవత్సరాల క్రితం సునీత అనే మహిళతో వివాహం జరిగింది. అయితే వీరి దాంపత్య జీవితంలో గత కొన్నేళ్లుగా తీవ్ర మనస్పర్థలు, గొడవలు చోటుచేసుకుంటున్నాయి. తమ కాపురంలో భార్య తరఫు బంధువులు మితిమీరి జోక్యం చేసుకుంటున్నారని, వారి వల్లే తమ మధ్య దూరం పెరుగుతోందని శేఖర్ తీవ్ర అసంతృప్తి, ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ తీవ్ర వాగ్వాదాలు జరిగేవి. తన సంసారంలో అత్తగారింటి వారి జోక్యం పెరిగిపోతోందన్న కక్షతో రగిలిపోయిన శేఖర్, వారిని అంతం చేయాలని పక్కా వ్యూహం రచించాడు.ఒక్కొక్కరిని ఇంటికి పిలిపించి.. రోకలితో నరమేధంఅక్టోబర్ 17వ తేదీ నుంచి నిందితుడు ఇందు శేఖర్ తన రక్తదాహాన్ని అమలు చేయడం ప్రారంభించాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ముందుగా పథకం ప్రకారం తన ఇంట్లోనే భార్య సునీతపై రోకలిబండతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు, ఒక్కొక్కరిని వివిధ కారణాలు చెప్పి, మాట్లాడుకుందామని ఇంటికి రప్పించాడు.ఇంటికి వచ్చిన భార్య తరఫు బంధువులను ఊహించని విధంగా రోకలిబండతో తలపై బలంగా కొట్టి వరుసగా హతమార్చాడు. ఈ క్రమంలో భార్య సునీత, అత్తతో పాటు కుటుంబానికి చెందిన ఏడుగురిని అతడు అతి కిరాతకంగా ప్రాణాలు తీశాడు. నగర శివార్లలో మృతదేహాల తరలింపుహత్యలు చేసిన అనంతరం ఆ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు శేఖర్ సినిమా ఫక్కీలో వ్యవహరించాడు. మృతదేహాలను ఒక్కొక్కటిగా తన క్యాబ్‌లోనే ఎక్కించుకుని బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో, శివారు ప్రదేశాల్లో పడేశాడు. కొన్ని రోజుల పాటు వరుసగా కుటుంబ సభ్యులెవరూ ఫోన్లు ఎత్తకపోవడం, బంధువుల జాడ తెలియకపోవడంతో మిగిలిన బంధువుల్లో తీవ్ర అనుమానాలు మొదలయ్యాయి.ఈ క్రమంలో అదృశ్యమైన వారి సమాచారంతో రంగంలోకి దిగిన రాజాజీనగర్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. అనుమానితుడిగా మారిన క్యాబ్ డ్రైవర్ ఇందు శేఖర్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో ఈ భయంకర నరమేధం గుట్టు రట్టయింది. తాను చేసిన హత్యల వివరాలను, మృతదేహాలను ఎక్కడెక్కడ విసిరేశాడో పోలీసులకు వివరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాల గుర్తింపు, స్వాధీన ప్రక్రియను వేగవంతం చేశారు. కేవలం కుటుంబంలో జోక్యం చేసుకుంటున్నారన్న కోపంతో ఏకంగా ఏడుగురి ప్రాణాలు తీసిన ఈ ఘటన బెంగళూరులో తీవ్ర సంచలనం రేపింది.మరింత చదవండి

Source link