ప్రభన్యూస్

భారత్‌లో డేటా సెంటర్ల బూమ్… 2030 నాటికి 5 రెట్లు వృద్ధి… హైదరాబాద్, వైజాగ్ కీలకం | బిజినెస్


క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రకారం, రాబోయే డేటా సెంటర్ సామర్థ్యంలో దాదాపు సగం ఇప్పటికే దీర్ఘకాలిక ఒప్పందాల కింద ఖరారైంది. దీనివల్ల కేవలం భవిష్యత్తులో డిమాండ్ వస్తుందనే అంచనాతో ప్రాజెక్టులు చేపట్టే పరిస్థితి తగ్గుతుంది. అలాగే, నిర్మించిన డేటా సెంటర్లను కస్టమర్లు ఉపయోగించకపోవడం వల్ల వచ్చే నష్టాల ముప్పు కూడా తగ్గుతుంది. క్లౌడ్ సేవల వినియోగం పెరగడం, ఎక్కువ కంప్యూటింగ్ సామర్థ్యం అవసరమయ్యే GenAI అప్లికేషన్లు విస్తరించడం వల్ల ప్రపంచంలోని పెద్ద టెక్నాలజీ కంపెనీలు డేటా సెంటర్ల కోసం ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనివల్ల ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే ఆదాయం ఎంత వస్తుందనే దానిపై కొంత స్పష్టత ఉంటుంది. ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా, భారీ స్థాయిలో జరుగుతున్నా ఆర్థికపరమైన రిస్క్‌ను తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి మరో ప్రధాన కారణం తక్కువ ఖర్చు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌లో డేటా సెంటర్ల నిర్మాణ ఖర్చు దాదాపు 20 శాతం తక్కువగా ఉంది. భూమి, నిర్మాణం, కార్మికుల ఖర్చులు తక్కువగా ఉండటమే దీనికి కారణం. దీనికి తోడు విద్యుత్ ఛార్జీలు కూడా తక్కువగా ఉండటంతో, ఇతర పోటీ మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో డేటా సెంటర్ల అద్దె ధరలు 30 నుంచి 35 శాతం తక్కువగా ఉంటున్నాయి. పునరుత్పాదక ఇంధనంతో నడిచే పెద్ద డేటా సెంటర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా భారత్‌కు కలిసొస్తోంది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను చేరుకోవాలనుకునే అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలకు ఇది ఆకర్షణగా మారుతోంది.

ఇది కూడా చదవండి: Old Gold: ఇంట్లో పాత బంగారం ఉందా? అమ్మకుండానే ఆదాయం పొందే 3 మార్గాలు ఇవే!

క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి మాట్లాడుతూ.. “డేటా సెంటర్ల ఏర్పాటులో భారత్‌కు ఉన్న ఖర్చు ప్రయోజనాలు దేశాన్ని మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని పలు పోటీ మార్కెట్లతో పోలిస్తే భూమి, నిర్మాణం, కార్మికుల ఖర్చులు తక్కువగా ఉండటంతో డెవలప్‌మెంట్ ఖర్చు దాదాపు ఐదో వంతు తక్కువగా ఉంది. తక్కువ విద్యుత్ ఛార్జీలు కూడా తోడవడంతో అద్దె ధరలు 30 నుంచి 35 శాతం తక్కువగా ఉంటున్నాయి. పునరుత్పాదక ఇంధనంతో పనిచేసే భారీ క్యాంపస్‌లను ఏర్పాటు చేయగలగడం అంతర్జాతీయ కంపెనీల పర్యావరణ లక్ష్యాలకు కూడా ఉపయోగపడుతోంది” అని వివరించారు. అయితే, ఇంత భారీ స్థాయిలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది. రాబోయే సుమారు 6 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యంలో దాదాపు మూడొంతుల వాటా విశాఖపట్నం, ముంబై, హైదరాబాద్ నగరాల్లోనే ఏర్పాటు కానుందని క్రిసిల్ తెలిపింది.

2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ మూడు నగరాల్లో డేటా సెంటర్లకు అవసరమయ్యే విద్యుత్ సామర్థ్యం, ఆయా నగరాల ప్రస్తుత గరిష్ట విద్యుత్ డిమాండ్‌తో పోలిస్తే భారీ స్థాయికి చేరనుంది. విశాఖపట్నంలో ప్రస్తుత గరిష్ట విద్యుత్ డిమాండ్‌లో దాదాపు 80 శాతానికి సమానమైన విద్యుత్ సామర్థ్యం డేటా సెంటర్లకు అవసరమవుతుంది. ముంబైలో ఇది 60 శాతంగా, హైదరాబాద్‌లో 20 శాతంగా ఉండొచ్చని అంచనా. అందుకే ఈ నగరాల్లో విద్యుత్ గ్రిడ్ కనెక్షన్లు సకాలంలో అందించడం, విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం చాలా ముఖ్యం. లేకపోతే డేటా సెంటర్ల పనులు ప్రారంభించడంలో ఆలస్యం కావచ్చు. నిర్మాణ ఖర్చులు కూడా పెరిగే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి: Special Trains: ట్రైన్ టికెట్ దొరకడం లేదా? హైదరాబాద్ నుంచి వెళ్లే ఈ రైళ్లల్లో వేల బెర్తులు ఖాళీ

అయితే, డేటా సెంటర్లకు ముందుగానే కస్టమర్లు ఖరారవుతుండటం ఈ సమస్యల నుంచి కొంత రక్షణ కల్పిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న డేటా సెంటర్లు దాదాపు 90 శాతం వినియోగ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డేటా సెంటర్ సామర్థ్యంలో 95 శాతానికి పైగా ఇప్పటికే ఒప్పందాల కింద ఖరారైంది. దీనివల్ల ప్రాజెక్టులు పూర్తయి అందుబాటులోకి వచ్చిన వెంటనే డెవలపర్లు కార్యకలాపాలను వేగంగా ప్రారంభించవచ్చు. అలాగే, ఆదాయం, నగదు ప్రవాహం కూడా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. డేటా సెంటర్లకు సంబంధించిన ఒప్పందాల నాణ్యత కూడా మెరుగుపడుతోంది. గతంలో సాధారణంగా 10 నుంచి 12 ఏళ్ల పాటు ఉండే ఒప్పందాల గడువు ఇప్పుడు 15 నుంచి 20 ఏళ్లకు పెరిగింది. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే ఆదాయంపై మరింత స్పష్టత ఏర్పడుతోంది.

క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ నితిన్ బన్సాల్ మాట్లాడుతూ.. “ఒప్పందాల ద్వారా వచ్చే ఆదాయం మరింత స్థిరంగా మారుతోంది. గతంలో 10-12 ఏళ్లుగా ఉన్న ఒప్పందాల గడువు ఇప్పుడు 15-20 ఏళ్లకు పెరిగింది. దీనివల్ల నగదు ప్రవాహంపై ముందుగానే అంచనా వేసుకోవచ్చు. ఒక కంపెనీ తన డేటాను, కార్యకలాపాలను మరో డేటా సెంటర్‌కు మార్చుకోవాలంటే చాలా ఖర్చు, సమయం అవసరమవుతాయి. కొత్త పరికరాల కోసం పెట్టుబడులు కూడా పెట్టాల్సి ఉంటుంది. ఈ కారణాలతో కస్టమర్లు పాత డేటా సెంటర్ సేవలనే కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఒప్పందాలు పునరుద్ధరించుకునే విషయంలో ఈ రంగానికి ఇంకా చెప్పుకోదగ్గ అనుభవం ఏర్పడలేదు. అదే సమయంలో, కొత్త తరం GenAI అప్లికేషన్ల అవసరాలకు తగ్గట్టుగా డేటా సెంటర్లను అప్‌గ్రేడ్ చేయాలి. అధిక విద్యుత్ వినియోగాన్ని తట్టుకునే వ్యవస్థలు, ఆధునిక కూలింగ్ సదుపాయాల కోసం డెవలపర్లు ఎప్పటికప్పుడు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది” అని చెప్పారు.

మరోవైపు, పెద్ద అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలపై డేటా సెంటర్ రంగం ఎక్కువగా ఆధారపడటం కూడా కొత్త రిస్క్‌లకు దారితీస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో డేటా సెంటర్ల అద్దె సామర్థ్యంలో 60-65 శాతంగా ఉన్న హైపర్‌స్కేలర్ల వాటా, 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 75-80 శాతానికి పెరగొచ్చని అంచనా. దీనివల్ల కొద్దిమంది పెద్ద కస్టమర్లపైనే డెవలపర్లు ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఒప్పందాల విషయంలో ఆ పెద్ద కంపెనీల బేరసారాల శక్తి పెరుగుతుంది. ఇప్పటివరకు డేటా సెంటర్ల అద్దె ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. కానీ, భవిష్యత్తులో డేటా సెంటర్ సామర్థ్యం వేగంగా పెరిగితే, హైపర్‌స్కేలర్లు తక్కువ ధరలకు సేవలు పొందేందుకు ఒత్తిడి చేసే అవకాశం ఉంది. అలా జరిగితే డెవలపర్ల ఆదాయం, ప్రాజెక్టులపై వచ్చే రాబడిపై ప్రభావం పడొచ్చు.

ఇది కూడా చదవండి: CC Camera Offer: కేవలం రూ.999కే సీసీటీవీ కెమెరా… మీ ఇంటికి ఫుల్ సెక్యూరిటీ

ఈ రంగంలో మరో ముఖ్యమైన అంశం భారీ పెట్టుబడి అవసరం. డేటా సెంటర్ల నిర్మాణానికి మొదట్లోనే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, ఆ ప్రాజెక్టుల నుంచి ఆదాయం రావడానికి సమయం పడుతుంది. సాధారణంగా పెట్టుబడులు పెట్టిన తర్వాత నగదు ప్రవాహం మొదలవడానికి 24 నుంచి 36 నెలలు పడుతుంది. ఈ సమయంలో కంపెనీల అప్పుల భారం ఎక్కువగానే ఉంటుంది. అయితే, ప్రాజెక్టులు పూర్తయి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత, ఒప్పందాలు చేసుకున్న సామర్థ్యం వినియోగంలోకి వచ్చి, వినియోగ శాతం పెరుగుతుంది. దాంతో నగదు ప్రవాహం మెరుగుపడుతుంది. క్రమంగా అప్పుల భారం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

మొత్తంగా చూస్తే, భారత్‌లో డేటా సెంటర్ల రంగానికి రాబోయే నాలుగేళ్లు భారీ వృద్ధికి అవకాశాలు కల్పించనున్నాయి. దీర్ఘకాలిక ఒప్పందాలు, ఇప్పటికే ఉన్న డేటా సెంటర్లలో అధిక వినియోగం, భారత్‌లో తక్కువ నిర్మాణ ఖర్చులు ఈ రంగానికి బలంగా నిలుస్తున్నాయి. ఇవి కంపెనీల ఆర్థిక స్థిరత్వానికి కూడా తోడ్పడతాయి. అయితే, ఈ అవకాశాలను నిజమైన ఆదాయంగా మార్చుకోవాలంటే కొన్ని సవాళ్లను అధిగమించాలి. అవసరమైన విద్యుత్‌ను సకాలంలో పొందడం, ప్రభుత్వ అనుమతులు తెచ్చుకోవడం, ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయడం, ఖర్చులను అదుపులో ఉంచడం చాలా ముఖ్యం. అలాగే, GenAI వల్ల ఏర్పడుతున్న డిమాండ్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందా? వేగంగా మారుతున్న కంప్యూటింగ్ అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్లు తమ సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయగలవా? అనే అంశాలు కూడా ఈ రంగంలో పెట్టుబడులపై వచ్చే రాబడిని నిర్ణయించనున్నాయి. అంటే, భారత్‌కు డేటా సెంటర్ల రంగంలో భారీ వృద్ధి అవకాశాలు ఉన్నప్పటికీ, ఆ వృద్ధిని నిలకడైన ఆర్థిక విజయంగా మార్చుకోవడం కంపెనీల అమలు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 3:53 pm Digital Edition : Prabhanews
భారత్‌లో డేటా సెంటర్ల బూమ్… 2030 నాటికి 5 రెట్లు వృద్ధి… హైదరాబాద్, వైజాగ్ కీలకం | బిజినెస్

క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రకారం, రాబోయే డేటా సెంటర్ సామర్థ్యంలో దాదాపు సగం ఇప్పటికే దీర్ఘకాలిక ఒప్పందాల కింద ఖరారైంది. దీనివల్ల కేవలం భవిష్యత్తులో డిమాండ్ వస్తుందనే అంచనాతో ప్రాజెక్టులు చేపట్టే పరిస్థితి తగ్గుతుంది. అలాగే, నిర్మించిన డేటా సెంటర్లను కస్టమర్లు ఉపయోగించకపోవడం వల్ల వచ్చే నష్టాల ముప్పు కూడా తగ్గుతుంది. క్లౌడ్ సేవల వినియోగం పెరగడం, ఎక్కువ కంప్యూటింగ్ సామర్థ్యం అవసరమయ్యే GenAI అప్లికేషన్లు విస్తరించడం వల్ల ప్రపంచంలోని పెద్ద టెక్నాలజీ కంపెనీలు డేటా సెంటర్ల కోసం ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనివల్ల ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే ఆదాయం ఎంత వస్తుందనే దానిపై కొంత స్పష్టత ఉంటుంది. ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా, భారీ స్థాయిలో జరుగుతున్నా ఆర్థికపరమైన రిస్క్‌ను తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి మరో ప్రధాన కారణం తక్కువ ఖర్చు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌లో డేటా సెంటర్ల నిర్మాణ ఖర్చు దాదాపు 20 శాతం తక్కువగా ఉంది. భూమి, నిర్మాణం, కార్మికుల ఖర్చులు తక్కువగా ఉండటమే దీనికి కారణం. దీనికి తోడు విద్యుత్ ఛార్జీలు కూడా తక్కువగా ఉండటంతో, ఇతర పోటీ మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో డేటా సెంటర్ల అద్దె ధరలు 30 నుంచి 35 శాతం తక్కువగా ఉంటున్నాయి. పునరుత్పాదక ఇంధనంతో నడిచే పెద్ద డేటా సెంటర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా భారత్‌కు కలిసొస్తోంది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను చేరుకోవాలనుకునే అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలకు ఇది ఆకర్షణగా మారుతోంది.ఇది కూడా చదవండి: Old Gold: ఇంట్లో పాత బంగారం ఉందా? అమ్మకుండానే ఆదాయం పొందే 3 మార్గాలు ఇవే!క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి మాట్లాడుతూ.. "డేటా సెంటర్ల ఏర్పాటులో భారత్‌కు ఉన్న ఖర్చు ప్రయోజనాలు దేశాన్ని మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని పలు పోటీ మార్కెట్లతో పోలిస్తే భూమి, నిర్మాణం, కార్మికుల ఖర్చులు తక్కువగా ఉండటంతో డెవలప్‌మెంట్ ఖర్చు దాదాపు ఐదో వంతు తక్కువగా ఉంది. తక్కువ విద్యుత్ ఛార్జీలు కూడా తోడవడంతో అద్దె ధరలు 30 నుంచి 35 శాతం తక్కువగా ఉంటున్నాయి. పునరుత్పాదక ఇంధనంతో పనిచేసే భారీ క్యాంపస్‌లను ఏర్పాటు చేయగలగడం అంతర్జాతీయ కంపెనీల పర్యావరణ లక్ష్యాలకు కూడా ఉపయోగపడుతోంది" అని వివరించారు. అయితే, ఇంత భారీ స్థాయిలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది. రాబోయే సుమారు 6 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యంలో దాదాపు మూడొంతుల వాటా విశాఖపట్నం, ముంబై, హైదరాబాద్ నగరాల్లోనే ఏర్పాటు కానుందని క్రిసిల్ తెలిపింది.2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ మూడు నగరాల్లో డేటా సెంటర్లకు అవసరమయ్యే విద్యుత్ సామర్థ్యం, ఆయా నగరాల ప్రస్తుత గరిష్ట విద్యుత్ డిమాండ్‌తో పోలిస్తే భారీ స్థాయికి చేరనుంది. విశాఖపట్నంలో ప్రస్తుత గరిష్ట విద్యుత్ డిమాండ్‌లో దాదాపు 80 శాతానికి సమానమైన విద్యుత్ సామర్థ్యం డేటా సెంటర్లకు అవసరమవుతుంది. ముంబైలో ఇది 60 శాతంగా, హైదరాబాద్‌లో 20 శాతంగా ఉండొచ్చని అంచనా. అందుకే ఈ నగరాల్లో విద్యుత్ గ్రిడ్ కనెక్షన్లు సకాలంలో అందించడం, విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం చాలా ముఖ్యం. లేకపోతే డేటా సెంటర్ల పనులు ప్రారంభించడంలో ఆలస్యం కావచ్చు. నిర్మాణ ఖర్చులు కూడా పెరిగే ప్రమాదం ఉంది.ఇది కూడా చదవండి: Special Trains: ట్రైన్ టికెట్ దొరకడం లేదా? హైదరాబాద్ నుంచి వెళ్లే ఈ రైళ్లల్లో వేల బెర్తులు ఖాళీఅయితే, డేటా సెంటర్లకు ముందుగానే కస్టమర్లు ఖరారవుతుండటం ఈ సమస్యల నుంచి కొంత రక్షణ కల్పిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న డేటా సెంటర్లు దాదాపు 90 శాతం వినియోగ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డేటా సెంటర్ సామర్థ్యంలో 95 శాతానికి పైగా ఇప్పటికే ఒప్పందాల కింద ఖరారైంది. దీనివల్ల ప్రాజెక్టులు పూర్తయి అందుబాటులోకి వచ్చిన వెంటనే డెవలపర్లు కార్యకలాపాలను వేగంగా ప్రారంభించవచ్చు. అలాగే, ఆదాయం, నగదు ప్రవాహం కూడా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. డేటా సెంటర్లకు సంబంధించిన ఒప్పందాల నాణ్యత కూడా మెరుగుపడుతోంది. గతంలో సాధారణంగా 10 నుంచి 12 ఏళ్ల పాటు ఉండే ఒప్పందాల గడువు ఇప్పుడు 15 నుంచి 20 ఏళ్లకు పెరిగింది. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే ఆదాయంపై మరింత స్పష్టత ఏర్పడుతోంది.క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ నితిన్ బన్సాల్ మాట్లాడుతూ.. "ఒప్పందాల ద్వారా వచ్చే ఆదాయం మరింత స్థిరంగా మారుతోంది. గతంలో 10-12 ఏళ్లుగా ఉన్న ఒప్పందాల గడువు ఇప్పుడు 15-20 ఏళ్లకు పెరిగింది. దీనివల్ల నగదు ప్రవాహంపై ముందుగానే అంచనా వేసుకోవచ్చు. ఒక కంపెనీ తన డేటాను, కార్యకలాపాలను మరో డేటా సెంటర్‌కు మార్చుకోవాలంటే చాలా ఖర్చు, సమయం అవసరమవుతాయి. కొత్త పరికరాల కోసం పెట్టుబడులు కూడా పెట్టాల్సి ఉంటుంది. ఈ కారణాలతో కస్టమర్లు పాత డేటా సెంటర్ సేవలనే కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఒప్పందాలు పునరుద్ధరించుకునే విషయంలో ఈ రంగానికి ఇంకా చెప్పుకోదగ్గ అనుభవం ఏర్పడలేదు. అదే సమయంలో, కొత్త తరం GenAI అప్లికేషన్ల అవసరాలకు తగ్గట్టుగా డేటా సెంటర్లను అప్‌గ్రేడ్ చేయాలి. అధిక విద్యుత్ వినియోగాన్ని తట్టుకునే వ్యవస్థలు, ఆధునిక కూలింగ్ సదుపాయాల కోసం డెవలపర్లు ఎప్పటికప్పుడు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది" అని చెప్పారు.మరోవైపు, పెద్ద అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలపై డేటా సెంటర్ రంగం ఎక్కువగా ఆధారపడటం కూడా కొత్త రిస్క్‌లకు దారితీస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో డేటా సెంటర్ల అద్దె సామర్థ్యంలో 60-65 శాతంగా ఉన్న హైపర్‌స్కేలర్ల వాటా, 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 75-80 శాతానికి పెరగొచ్చని అంచనా. దీనివల్ల కొద్దిమంది పెద్ద కస్టమర్లపైనే డెవలపర్లు ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఒప్పందాల విషయంలో ఆ పెద్ద కంపెనీల బేరసారాల శక్తి పెరుగుతుంది. ఇప్పటివరకు డేటా సెంటర్ల అద్దె ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. కానీ, భవిష్యత్తులో డేటా సెంటర్ సామర్థ్యం వేగంగా పెరిగితే, హైపర్‌స్కేలర్లు తక్కువ ధరలకు సేవలు పొందేందుకు ఒత్తిడి చేసే అవకాశం ఉంది. అలా జరిగితే డెవలపర్ల ఆదాయం, ప్రాజెక్టులపై వచ్చే రాబడిపై ప్రభావం పడొచ్చు.ఇది కూడా చదవండి: CC Camera Offer: కేవలం రూ.999కే సీసీటీవీ కెమెరా... మీ ఇంటికి ఫుల్ సెక్యూరిటీఈ రంగంలో మరో ముఖ్యమైన అంశం భారీ పెట్టుబడి అవసరం. డేటా సెంటర్ల నిర్మాణానికి మొదట్లోనే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, ఆ ప్రాజెక్టుల నుంచి ఆదాయం రావడానికి సమయం పడుతుంది. సాధారణంగా పెట్టుబడులు పెట్టిన తర్వాత నగదు ప్రవాహం మొదలవడానికి 24 నుంచి 36 నెలలు పడుతుంది. ఈ సమయంలో కంపెనీల అప్పుల భారం ఎక్కువగానే ఉంటుంది. అయితే, ప్రాజెక్టులు పూర్తయి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత, ఒప్పందాలు చేసుకున్న సామర్థ్యం వినియోగంలోకి వచ్చి, వినియోగ శాతం పెరుగుతుంది. దాంతో నగదు ప్రవాహం మెరుగుపడుతుంది. క్రమంగా అప్పుల భారం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.మొత్తంగా చూస్తే, భారత్‌లో డేటా సెంటర్ల రంగానికి రాబోయే నాలుగేళ్లు భారీ వృద్ధికి అవకాశాలు కల్పించనున్నాయి. దీర్ఘకాలిక ఒప్పందాలు, ఇప్పటికే ఉన్న డేటా సెంటర్లలో అధిక వినియోగం, భారత్‌లో తక్కువ నిర్మాణ ఖర్చులు ఈ రంగానికి బలంగా నిలుస్తున్నాయి. ఇవి కంపెనీల ఆర్థిక స్థిరత్వానికి కూడా తోడ్పడతాయి. అయితే, ఈ అవకాశాలను నిజమైన ఆదాయంగా మార్చుకోవాలంటే కొన్ని సవాళ్లను అధిగమించాలి. అవసరమైన విద్యుత్‌ను సకాలంలో పొందడం, ప్రభుత్వ అనుమతులు తెచ్చుకోవడం, ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయడం, ఖర్చులను అదుపులో ఉంచడం చాలా ముఖ్యం. అలాగే, GenAI వల్ల ఏర్పడుతున్న డిమాండ్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందా? వేగంగా మారుతున్న కంప్యూటింగ్ అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్లు తమ సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయగలవా? అనే అంశాలు కూడా ఈ రంగంలో పెట్టుబడులపై వచ్చే రాబడిని నిర్ణయించనున్నాయి. అంటే, భారత్‌కు డేటా సెంటర్ల రంగంలో భారీ వృద్ధి అవకాశాలు ఉన్నప్పటికీ, ఆ వృద్ధిని నిలకడైన ఆర్థిక విజయంగా మార్చుకోవడం కంపెనీల అమలు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.

Source link