Vande Bharat sleeper: అనంతపురం వాసులకు పండగే.. బెంగళూరు ముంబయి వందేభారత్ స్లీపర్ రైలు షెడ్యూల్, రూట్ మ్యాప్ ఇదే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Vande Bharat sleeper: భారతీయ రైల్వే చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి, ఐటీ రాజధాని బెంగళూరు నగరాల మధ్య అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది.

వందే భారత్ స్లీపర్ ట్రైన్
వందే భారత్ స్లీపర్ ట్రైన్

బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ జెండా ఊపి ఈ అత్యాధునిక సెమీ హైస్పీడ్ స్లీపర్ రైలును లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రులు వి. సోమన్న, శోభా కరంద్లజే, ఎంపీలు డాక్టర్ సీఎన్ మంజునాథ్, తేజస్వి సూర్య, పీసీ మోహన్ తదితర ప్రజాప్రతినిధులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రైలు వేళలు.. ప్రయాణ సమయం ఆదా

రెండు మెట్రో నగరాల మధ్య రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులకు ఈ సర్వీసు సరికొత్త అనుభూతిని అందించనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గమ్యస్థానాన్ని చేరుకోవడానికి దాదాపు 22 నుంచి 24 గంటల సమయం తీసుకుంటుండగా, ఈ వందేభారత్ స్లీపర్ రైలు ద్వారా సుమారు 16 గంటల్లోనే ప్రయాణం పూర్తవుతుంది. తద్వారా సుమారు 6 నుంచి 8 గంటల సమయం ఆదా కానుంది. ఈ రైలు వారానికి ఆరు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.

బెంగళూరు – ముంబయి (రైలు నం. 27652): సోమవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో రాత్రి 7.45 గంటలకు బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 11.55 గంటలకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (CSMT) చేరుకుంటుంది.

ముంబయి – బెంగళూరు (రైలు నం. 27651): మంగళవారం మినహా మిగతా రోజుల్లో రాత్రి 8.10 గంటలకు ముంబయి (CSMT) నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు బెంగళూరు (SMVT) చేరుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా..

ఈ రైలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల మీదుగా ప్రయాణించనుంది. ప్రధానంగా ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకు ఇది ఎంతగానో ప్రయోజనకరంగా మారనుంది. బెంగళూరు నుంచి బయలుదేరి హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు మీదుగా రాయచూర్, యాద్గిర్, కలబురగి, సోలాపూర్, పుణె, కల్యాణ్ స్టేషన్లలో హాల్టింగ్‌లు కల్పించారు. దీంతో రాయలసీమ ప్రాంత ప్రజలకు వాణిజ్య నగరమైన ముంబయితో పాటు ఐటీ హబ్ బెంగళూరుకు వేగవంతమైన రాత్రి ప్రయాణ సదుపాయం సమకూరింది.

అత్యాధునిక హంగులు.. విమాన స్థాయి సౌకర్యాలు

మొత్తం 16 బోగీలతో రూపొందించిన ఈ రైలులో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ బోగీలు ఉన్నాయి. మొత్తం 823 మంది ప్రయాణించేలా కెపాసిటీని కేటాయించారు. ప్రయాణికులకు గరిష్ఠ సౌకర్యాన్ని కల్పించేందుకు ఎర్గోనామిక్ డిజైన్ బెర్త్‌లు, మెరుగైన కుషనింగ్, పై బెర్త్‌లకు ఎక్కేందుకు ప్రత్యేక నిచ్చెనలు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక డిజైన్ టాయిలెట్లు, ప్రయాణంలో కుదుపులు (జెర్క్స్) రాకుండా ప్రపంచ స్థాయి కప్లర్ల టెక్నాలజీని ఉపయోగించారు. భద్రత కోసం రైలులో అధునాతన కవచ్ (Kavach) వ్యవస్థ, ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్, సెన్సార్లతో పనిచేసే ఆటోమేటిక్ తలుపులను అనుసంధానించారు. ఈ వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభంతో కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రల మధ్య సరికొత్త రవాణా విప్లవం ఆరంభమైందని, దీర్ఘకాల ప్రయాణాలను సుఖమయం చేయడంలో ఇది మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 5:58 am Digital Edition : Prabhanews
Vande Bharat sleeper: అనంతపురం వాసులకు పండగే.. బెంగళూరు ముంబయి వందేభారత్ స్లీపర్ రైలు షెడ్యూల్, రూట్ మ్యాప్ ఇదే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Nov 02, 2026 5:52 AM ISTVande Bharat sleeper: భారతీయ రైల్వే చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి, ఐటీ రాజధాని బెంగళూరు నగరాల మధ్య అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది.వందే భారత్ స్లీపర్ ట్రైన్బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ జెండా ఊపి ఈ అత్యాధునిక సెమీ హైస్పీడ్ స్లీపర్ రైలును లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రులు వి. సోమన్న, శోభా కరంద్లజే, ఎంపీలు డాక్టర్ సీఎన్ మంజునాథ్, తేజస్వి సూర్య, పీసీ మోహన్ తదితర ప్రజాప్రతినిధులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.రైలు వేళలు.. ప్రయాణ సమయం ఆదారెండు మెట్రో నగరాల మధ్య రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులకు ఈ సర్వీసు సరికొత్త అనుభూతిని అందించనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గమ్యస్థానాన్ని చేరుకోవడానికి దాదాపు 22 నుంచి 24 గంటల సమయం తీసుకుంటుండగా, ఈ వందేభారత్ స్లీపర్ రైలు ద్వారా సుమారు 16 గంటల్లోనే ప్రయాణం పూర్తవుతుంది. తద్వారా సుమారు 6 నుంచి 8 గంటల సమయం ఆదా కానుంది. ఈ రైలు వారానికి ఆరు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.బెంగళూరు - ముంబయి (రైలు నం. 27652): సోమవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో రాత్రి 7.45 గంటలకు బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 11.55 గంటలకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (CSMT) చేరుకుంటుంది.ముంబయి - బెంగళూరు (రైలు నం. 27651): మంగళవారం మినహా మిగతా రోజుల్లో రాత్రి 8.10 గంటలకు ముంబయి (CSMT) నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు బెంగళూరు (SMVT) చేరుకుంటుంది.ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా..ఈ రైలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల మీదుగా ప్రయాణించనుంది. ప్రధానంగా ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకు ఇది ఎంతగానో ప్రయోజనకరంగా మారనుంది. బెంగళూరు నుంచి బయలుదేరి హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు మీదుగా రాయచూర్, యాద్గిర్, కలబురగి, సోలాపూర్, పుణె, కల్యాణ్ స్టేషన్లలో హాల్టింగ్‌లు కల్పించారు. దీంతో రాయలసీమ ప్రాంత ప్రజలకు వాణిజ్య నగరమైన ముంబయితో పాటు ఐటీ హబ్ బెంగళూరుకు వేగవంతమైన రాత్రి ప్రయాణ సదుపాయం సమకూరింది.అత్యాధునిక హంగులు.. విమాన స్థాయి సౌకర్యాలుమొత్తం 16 బోగీలతో రూపొందించిన ఈ రైలులో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ బోగీలు ఉన్నాయి. మొత్తం 823 మంది ప్రయాణించేలా కెపాసిటీని కేటాయించారు. ప్రయాణికులకు గరిష్ఠ సౌకర్యాన్ని కల్పించేందుకు ఎర్గోనామిక్ డిజైన్ బెర్త్‌లు, మెరుగైన కుషనింగ్, పై బెర్త్‌లకు ఎక్కేందుకు ప్రత్యేక నిచ్చెనలు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక డిజైన్ టాయిలెట్లు, ప్రయాణంలో కుదుపులు (జెర్క్స్) రాకుండా ప్రపంచ స్థాయి కప్లర్ల టెక్నాలజీని ఉపయోగించారు. భద్రత కోసం రైలులో అధునాతన కవచ్ (Kavach) వ్యవస్థ, ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్, సెన్సార్లతో పనిచేసే ఆటోమేటిక్ తలుపులను అనుసంధానించారు. ఈ వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభంతో కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రల మధ్య సరికొత్త రవాణా విప్లవం ఆరంభమైందని, దీర్ఘకాల ప్రయాణాలను సుఖమయం చేయడంలో ఇది మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.మరింత చదవండి

Source link