ప్రభన్యూస్

భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. 70ఎంఎం స్క్రీన్‌పై ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్ | తెలుగు సినిమా వార్తలు


ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు సోనూసూద్ ముఖ్య అతిథిగా హాజరై ‘ఓ నా సిద్ధయ్య’ పాటను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓపెన్ ప్లేస్‌లో 70ఎంఎం భారీ స్క్రీన్‌పై పాటను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి వినూత్న ప్రయత్నం చేసిన సిద్ధయ్య టీమ్‌ను అభినందిస్తూ, పాట మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

మరో ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ‘ఓ నా సిద్ధయ్య’ పాట ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకకు హీరో ఇంద్రరామ్, సింగర్ నల్గొండ గద్దర్ నరసన్న, ప్రముఖ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావలి, నటుడు ఉత్తేజ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరంతా ‘ఓ నా సిద్ధయ్య’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్, ప్రేక్షకుల సందడి, వర్షంలోనూ కొనసాగిన వేడుకతో శంషాబాద్‌లో ఈ సాంగ్ లాంచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

భార్యాభర్తల ప్రేమానుబంధానికి ప్రతిరూపం ‘ఓ నా సిద్ధయ్య’

‘ఓ నా సిద్ధయ్య’ అనేది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, అనుబంధం, పరస్పర అవగాహన, జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచే తత్వాన్ని ఆవిష్కరించే ‘భార్యాభర్తల భావోద్వేగ ప్రేమకథ’. పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌లో సిద్ధయ్య, చిట్టెమ్మ పాత్రల ద్వారా దాంపత్య జీవితంలోని సహజమైన భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించారు.

సిద్ధయ్య పాత్రలో నటించడంతో పాటు ఈ పాటను నిర్మించిన సిద్ధు రెడ్డి కందకట్ల నిజజీవిత అనుభవాల స్ఫూర్తితో ఈ పాటను రూపొందించడం విశేషం. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భార్యాభర్తలు ఒకరికొకరు అండగా నిలవడం, కష్టసుఖాలను కలసి పంచుకోవడం, పరస్పర నమ్మకంతో జీవితాన్ని ముందుకు నడిపించడం వంటి విలువైన అంశాలను ఈ పాటలో అందంగా చూపించారు. కేవలం భార్యాభర్తల మధ్య ప్రేమకే పరిమితం కాకుండా, తమ చుట్టూ ఉన్నవారి కష్టాలను అర్థం చేసుకుంటూ, అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తూ సమాజ సేవలోనూ భాగస్వాములయ్యే సిద్ధయ్య, చిట్టెమ్మ పాత్రలు ఈ పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. కుటుంబ బంధాల గొప్పతనాన్ని చాటిచెబుతూ, కష్టకాలంలోనూ ఒకరికొకరు తోడుగా నిలవాలనే సందేశాన్ని ఈ పాట ప్రేక్షకులకు అందిస్తుంది.

వినోదంతో పాటు సామాజిక సేవకు పెద్దపీట:

‘ఓ నా సిద్ధయ్య’ గ్రాండ్ లాంచ్ కేవలం పాట విడుదలకే పరిమితం కాలేదు. సామాజిక బాధ్యతకు కూడా పెద్దపీట వేస్తూ సిద్ధు రెడ్డి కందకట్ల మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో నిర్వహించిన కార్యక్రమంలో 300 మంది ఆటో డ్రైవర్లకు బీమా సదుపాయాలు కల్పించి, నిత్యం కష్టపడి జీవించే వారికి భద్రత కల్పించే ప్రయత్నం చేశారు. అలాగే సినీ పరిశ్రమలో తెరవెనుక పనిచేసే కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి హెల్మెట్లు పంపిణీ చేశారు. రోడ్డు భద్రత, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహాయం వంటి అంశాల ద్వారా అవసరంలో ఉన్నవారికి అండగా నిలవాలన్నదే ఆయన లక్ష్యం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 November 2026, 2:32 pm Digital Edition : Prabhanews
భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. 70ఎంఎం స్క్రీన్‌పై ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్ | తెలుగు సినిమా వార్తలు

ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు సోనూసూద్ ముఖ్య అతిథిగా హాజరై ‘ఓ నా సిద్ధయ్య’ పాటను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓపెన్ ప్లేస్‌లో 70ఎంఎం భారీ స్క్రీన్‌పై పాటను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి వినూత్న ప్రయత్నం చేసిన సిద్ధయ్య టీమ్‌ను అభినందిస్తూ, పాట మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.మరో ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ‘ఓ నా సిద్ధయ్య’ పాట ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ వేడుకకు హీరో ఇంద్రరామ్, సింగర్ నల్గొండ గద్దర్ నరసన్న, ప్రముఖ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావలి, నటుడు ఉత్తేజ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరంతా ‘ఓ నా సిద్ధయ్య’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్, ప్రేక్షకుల సందడి, వర్షంలోనూ కొనసాగిన వేడుకతో శంషాబాద్‌లో ఈ సాంగ్ లాంచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.భార్యాభర్తల ప్రేమానుబంధానికి ప్రతిరూపం ‘ఓ నా సిద్ధయ్య’‘ఓ నా సిద్ధయ్య’ అనేది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, అనుబంధం, పరస్పర అవగాహన, జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచే తత్వాన్ని ఆవిష్కరించే ‘భార్యాభర్తల భావోద్వేగ ప్రేమకథ’. పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌లో సిద్ధయ్య, చిట్టెమ్మ పాత్రల ద్వారా దాంపత్య జీవితంలోని సహజమైన భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించారు.సిద్ధయ్య పాత్రలో నటించడంతో పాటు ఈ పాటను నిర్మించిన సిద్ధు రెడ్డి కందకట్ల నిజజీవిత అనుభవాల స్ఫూర్తితో ఈ పాటను రూపొందించడం విశేషం. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భార్యాభర్తలు ఒకరికొకరు అండగా నిలవడం, కష్టసుఖాలను కలసి పంచుకోవడం, పరస్పర నమ్మకంతో జీవితాన్ని ముందుకు నడిపించడం వంటి విలువైన అంశాలను ఈ పాటలో అందంగా చూపించారు. కేవలం భార్యాభర్తల మధ్య ప్రేమకే పరిమితం కాకుండా, తమ చుట్టూ ఉన్నవారి కష్టాలను అర్థం చేసుకుంటూ, అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తూ సమాజ సేవలోనూ భాగస్వాములయ్యే సిద్ధయ్య, చిట్టెమ్మ పాత్రలు ఈ పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. కుటుంబ బంధాల గొప్పతనాన్ని చాటిచెబుతూ, కష్టకాలంలోనూ ఒకరికొకరు తోడుగా నిలవాలనే సందేశాన్ని ఈ పాట ప్రేక్షకులకు అందిస్తుంది.వినోదంతో పాటు సామాజిక సేవకు పెద్దపీట:‘ఓ నా సిద్ధయ్య’ గ్రాండ్ లాంచ్ కేవలం పాట విడుదలకే పరిమితం కాలేదు. సామాజిక బాధ్యతకు కూడా పెద్దపీట వేస్తూ సిద్ధు రెడ్డి కందకట్ల మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో నిర్వహించిన కార్యక్రమంలో 300 మంది ఆటో డ్రైవర్లకు బీమా సదుపాయాలు కల్పించి, నిత్యం కష్టపడి జీవించే వారికి భద్రత కల్పించే ప్రయత్నం చేశారు. అలాగే సినీ పరిశ్రమలో తెరవెనుక పనిచేసే కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి హెల్మెట్లు పంపిణీ చేశారు. రోడ్డు భద్రత, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహాయం వంటి అంశాల ద్వారా అవసరంలో ఉన్నవారికి అండగా నిలవాలన్నదే ఆయన లక్ష్యం.

Source link